BigTV English

Software engineer suicide: పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి.. చెరువులో శవమై తేలిన ప్రియుడు, అసలు ఏం జరిగింది?

Software engineer suicide: పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి.. చెరువులో శవమై తేలిన ప్రియుడు, అసలు ఏం జరిగింది?

Software engineer suicide: గాళ్‌ఫ్రెండ్ నుంచి మ్యారేజ్ విషయంలో ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి ఒత్తిడి పెరిగింది. కొద్దిరోజులు ఆగాలని రిక్వెస్ట్ చేశాడు. సమయం గడిచింది.. ఈ విషయం ఇంట్లో‌వాళ్లకు చెప్పడానికి సాహసం చేయలేకపోయాడు. ఈ ఒత్తిడిని పక్షం రోజులుగా దిగిమింగుతూ వస్తున్నాడు. చివరకు తట్టుకోలేక ఈ లోకాన్ని విడిచిపెట్టాడు సాఫ్ట్‌వేర్‌ఇంజనీర్ బాలాజీ.


హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల బాలాజీ మాదాపూర్‌లోని ఐటీ కంపెనీలో పని చేస్తున్నా డు. ఈ టెక్కీకి డబ్బులకు కొదవలేదు. కాకపోతే చిక్కంతా ప్రియురాలి నుంచే. ఓ అమ్మాయిని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడో తెలీదు. బాలాజీ జాబ్‌లో సెటిలైపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురా లి నుంచి ఒత్తిడి పెరిగింది. కొద్దిరోజులు ఆగాలంటూ మ్యారేజ్ విషయాన్ని పక్కనపెట్టాడు. ఈ విధంగా పక్షం రోజులు గడిచింది.

టెక్కీ బాలాజీ తన లవ్ విషయాన్ని ఇంట్లో పేరెంట్స్ చెప్పలేదు. వారి ఇంట్లో పరిస్థితులు ఏంటన్నది తెలీదు. ఒకవైపు నుంచి ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని ఒకటే ఒత్తిడి పెట్టేది. అయితే ఈనెల 24న ఆఫీసుకు వెళ్లిన బాలాజీ, రాత్రి అయినా ఇంటికి వెళ్లలేదు. పేరెంట్స్‌కు టెన్షన్ మొదలైంది. వెంటనే ఫోన్ చేయగా స్విచ్చాప్ అని వచ్చింది. బాలాజీ ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి కనుక్కున్నా జాడ తెలియలేదు. చివరకు చేసేదేమీ లేక మరుసటిరోజు రాయదుర్గం పోలీసులకు బాలాజీ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తొలుత బాలాజీ పని చేసిన కంపెనీకి వెళ్లారు. 24న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు బయటకు వెళ్లినట్టు తేలింది. అయితే బాలాజీ ఎక్కడకు వెళ్లాడన్నది పోలీసులకు సవాల్‌గా మారింది. తొలుత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తుండగా, దుర్గం చెరువు బ్రిడ్జి నుంచి లేక్‌లోకి ఓ వ్యక్తి దూకినట్టు కనిపించింది.

గాలింపు చేపట్టగా డెడ్‌బాడీ కనిపించింది. మెడలో ఐడీ కార్డుని పరిశీలించారు.బాలాజీదేనని నిర్ణయానికి వచ్చారు పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎందుకు చనిపోయాడన్నది పోలీసులకు అసలు ప్రశ్న.

ALSO READ: కామారెడ్డిలో దారుణం.. గొర్రెలు తెచ్చిన చావులు.. రెండునెలల్లోనే ?

దీనికోసం ఫ్రెండ్స్, ఇంట్లోవారిని ఆరా తీశారు. చివరకు అసలు విషయం బయటపడింది. బాలాజీ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు వెల్లడైంది. పెళ్లి చేసుకోవాలంటూ బాలాజీపై ఆమె ఒత్తిడి చేసేదని తేలింది. ఈ విషయం ఇంట్లోవారికి చెప్పలేక ఒత్తిడి లోనై సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పూర్తి విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×