BigTV English

IND Vs NZ : మూడో వన్డేలో టీమిండియా విక్టరీ.. సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్

IND Vs NZ : మూడో వన్డేలో టీమిండియా విక్టరీ.. సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్

IND Vs NZ : మూడో వన్డేలోనూ టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ బ్యాటర్లను భారత్ బౌలర్ల కట్టడి చేశారు. తొలి ఓవర్ రెండో బంతికే ఫిన్ అలెన్ ను హార్థిక్ పాండ్యా డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే అద్బుతంగా పోరాడాడు. కాన్వే 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సులతో 138 పరుగులు చేశాడు. హెన్రీ నికోల్స్ 42 పరుగులతో కాన్వేకు సహకారం అందించాడు. ఆ తర్వాత మిచెల్ (24) కాసేపు నిలబడ్డాడు. కానీ కెప్టెన్ లేథమ్ డకౌట్ కావడం, ఆ తర్వాత గ్లెన్ ఫిలప్స్ 5 పరుగులకే అవుట్ కావడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. తొలి వన్డే సెంచరీ హీరో బ్రాస్ వెల్ , సాంట్నర్ కాసేపు పోరాడిన అప్పటికే భారత్ విజయం ఖరారైపోయింది. చివరికి కివీస్ 295 పరుగులకే ఆలౌట్ అయ్యింది.


భారత్ బౌలర్లలో శార్థల్ ఠాకూర్, కులదీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు. చాహల్ కు రెండు వికెట్లు దక్కాయి. ఉమ్రాన్ మాలిక్ , హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ..కివీస్ ముందు 386 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ బ్యాటర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇండోర్ మైదానంలో విధ్వంసం సృష్టించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ ( 101), గిల్ (112) సెంచరీలతో చెలరేగారు. హార్ధిక్ పాండ్యా (54), కోహ్లీ (36) రాణించారు. శార్ధుల్ ఠాకూర్ 25 పరుగులతో మెరుపులు మెరుపించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది.


రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 101 పరుగులు చేశాడు. హిట్ మ్యాన్ తొలి వికెట్ కు శుభ్ మన్ గిల్ తో కలిసి 212 పరుగులు జోడించాడు. 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సులతో 112 పరుగులు చేసి శుభ్ మన్ గిల్ అదగొట్టాడు. గిల్ కు ఈ సిరీస్ రెండో సెంచరీ ఇది . తొలి మ్యాచ్ లో డబుల్ సెంచరీ బాదాడు. మొత్తం మీద ఈ సిరీస్ 360 పరుగులు చేశాడు గిల్. దీంతో మరో రికార్డును బద్దలు కొట్టాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు బాబర్‌ అజామ్‌ పేరిట ఉన్న 360 (3 మ్యాచ్‌ల్లో) పరుగుల రికార్డును సమం చేశాడు. ఇక భారత్‌లో తరపున గతంలో విరాట్‌ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో 283 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ బౌలర్లు తొలి వన్డే మాదిరిగానే తేలిపోయారు. జాకబ్ డప్పీ 3 వికెట్లు తీసినా 100 పరుగులు సమర్పించుకున్నాడు. ఫెర్గూసన్, సాంట్నర్ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపోయారు. మరో బౌలర్ టిక్నర్ కూడా 3 వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చాడు.

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×