BigTV English

Ananthadri Gold Lizard : అనంతాద్రిలో బంగారు బల్లి.. ఆ దోషాలు తొలగాలంటే వెళ్లాల్సిందే

Ananthadri Gold Lizard : అనంతాద్రిలో బంగారు బల్లి.. ఆ దోషాలు తొలగాలంటే వెళ్లాల్సిందే

Ananthadri Gold Lizard : బంగారు బల్లి అంటే కంచి కామాక్షి దేవాలయం గుర్తొస్తుంది. తమిళనాడు లో ఉన్న కంచి దేవాలయంలో సూర్య, చంద్ర, వెండి, బంగారు బల్లులు దర్శనమిస్తాయి. బల్లి మీద పడితే దోషాలు కలుగుతాయని.. ఆ దోషాలు తొలగాలంటే బంగారు బల్లిని ముట్టుకుంటే దోష నివారణ అవుతుందని నమ్మకం. 2018 మే 13 తిరుమలలోని మోకాళ్ల పర్వతం 3,150వ మెట్టు వద్ద నిజమైన బంగారు బల్లిని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.


కంచిలో ఉన్న కామాక్షి అమ్మవారి ఆలయం వరకూ వెళ్లలేని వారు.. మహబూబాబాద్ జిల్లా కేంద్రం అనంతాద్రిలో వెలసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.. ఆలయ పూజారులు ఇక్కడ బంగారు, వెండి, సూర్య, చంద్రులను ప్రతిష్టించారు. దీంతో భక్తులు బల్లి దోషాలు తొలగించుకునేందుకు వెళ్తున్నారు. కంచి కి వెళ్ళలేని వారు అనంతాద్రిలో ఉన్న ప్రతిమలను దర్శించుకుని పునీతులవుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీ ఇంటికి తూర్పున బల్లి శబ్ధం వస్తే రాహుగ్రహ ప్రభావమని అర్థం. అనూహ్యమైన భయాలతో పాటు.. అశుభవార్తలను వింటారని జ్యోతిష్యులు చెబుతున్నమాట. ఇలాంటివి జరిగినా బంగారుబల్లిని దర్శించుకుంటే ఆ దోషాలు ఉండవంటున్నారు.


Also Read : ఆగస్టు 4 నుండి 24 రోజుల పాటు ఈ రాశులకు స్వర్ణ కాలమే..

కంచిలో ఉన్న బంగారు, వెండి బల్లి వెనుక ఒక పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వకాలంలో గౌతమ మహర్షి వద్దనున్న ఇద్దరు శిష్యులు.. నదీతీరానికి వెళ్లి కుండతో నీటిని తీసుకువస్తుండగా.. ఆ నీటిలో బల్లిపడింది. ఈ విషయాన్ని గౌతముడి శిష్యులు గ్రహించకుండా నీటినే అలాగే తీసుకెళ్లారు. దాంతో.. ఆ ఇద్దరు శిష్యుల్ని బల్లులుగా మారిపోవాలని శపించాడు గౌతముడు.

జీవితాంతం బల్లులుగానే ఉండటమంటే కష్టమని, శాపవిమోచనం కోరగా.. కాంచీపురంలోనున్న వరదరాజపెరుమాళ్ దేవాలయంలో వారికి ముక్తి లభిస్తుందని చెబుతాడు. అలా గౌతముడి ఇద్దరు శిష్యులు ఆ ఆలయంలో బల్లుల రూపంలో మోక్షం కోసం ప్రార్థించగా.. వారికి మోక్షం లభించింది.

Related News

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×