Home Loan: మీరు నెల జీతం తీసుకొనే ఉద్యోగి కాదా? మీరు డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది. మీరు భవిష్యత్తులో ఇంటి రుణాన్ని సులభంగా తీసుకోవచ్చు. డిజిటల్ ఫుట్‌ప్రింట్ ఆధారంగా హోమ్ లోన్ అందించే పథకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. MSMEతో అనుబంధించబడిన వ్యక్తుల కోసం ఇలాంటి స్కీమ్‌ను తీసుకొస్తున్నారు. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీని గురించి కొన్ని వివరాలను వెల్లడించారు.
ఓ నివేదిక ప్రకారం.. డిజిటల్ ఫుట్‌ప్రింట్ ఆధారంగా ప్రజలకు హోమ్ లోన్ ఇవ్వడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ MSME అసెస్‌మెంట్ మోడల్ తరహాలో ఒక పథకాన్ని రూపొందిస్తోంది. ఈ పథకం ద్వారా ఆర్థిక పరిస్థితిని సులభంగా అంచనా వేయలేని వ్యక్తులకు రుణాలను సులభంగా పొందొచ్చు.
Also Read: BSNL And Elon Musk Partnership: ఆట ఇప్పుడే మొదలైంది.. BSNLతో ఎలాన్ మస్క్ ఒప్పందం..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో MSMEలను సులభంగా అంచనా వేయడానికి, డబ్బు అందించేలా అన్ని ప్రభుత్వ బ్యాంకులు స్వయంగా ఒక వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. కొత్త మోడల్ ప్రకారం బ్యాంకులు వారి డిజిటల్ ఫుట్‌ప్రింట్ ఆధారంగా, వారి బ్యాలెన్స్ షీట్‌ను దృష్టిలో ఉంచుకోకుండా MSMEలకు డబ్బు ఇవ్వాలి. ప్రతి ఎంఎస్‌ఎంఈ బ్యాలెన్స్‌షీట్‌ను చూపించలేమని ఆయన అన్నారు. బ్యాంకులు MSMEలను కార్పొరేట్‌ల మాదిరిగానే చూడాలి.
ఈ సందర్భంగా ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి మాట్లాడుతూ హౌసింగ్ రంగానికి ఇదే విధమైన ఉత్పత్తిని చేయడానికి మేము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగం లేదా పన్ను చెల్లించే వ్యక్తులు మాత్రమే బ్యాంకు నుండి గృహ రుణం పొందవచ్చు. కొత్త మోడల్ ద్వారా దీనికి సంబంధం లేకుండా నివసిస్తున్న ప్రజలకు డిజిటల్ ఫుట్‌ప్రింట్ ఆధారంగా గృహ రుణాలును అందిస్తామని అన్నారు.
Also Read: Parle-G Success Story: పార్లే కంపెనీ ఎలా పుట్టింది.. స్వదేశీ ఉద్యమానికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి..?
ఆయన ఒక ఉదాహరణతో ఇలా వివరించారు.. ఎవరైనా చాయ్, సమోసా విక్రయించే దుకాణాన్ని కలిగి ఉన్నారని అనుకుందాం. ఆ దుకాణం బాగా రన్ అవుతుందని బ్యాంకుకు తెలుసు, కాని వారికి లోన్ అందించడానికి రూల్స్ ఒప్పుకోవు. కొత్త మోడల్ ద్వారా దుకాణ యజమాని అతడు లేదా ఆమె బ్యాంక్ ఖాతా లేదా విద్యుత్ బిల్లును చూపవచ్చు. వీటి ఆధారంగా బ్యాంకు రూ. 5 లక్షలు లేదా రూ. 10 లక్షల రుణం అందింస్తుందని స్పష్టం చేశారు.