Big Stories

Male Beauty Tips: వింటర్ టైమ్.. అబ్బాయిల అందానికి టిప్స్

Male Beauty Tips: ఆడవాళ్లకే కాదు.. పురుషులకీ బోలెడ్ స్కిన్ సమస్యలు ఉంటాయి. పైగా అందంపై పోకస్ పెట్డడంలో ఆడవారికి ఏ మాత్రం తీసిపోము అంటున్నారు మగరాయుళ్లు. దాని కోసం అనేక రకాల కాస్మోటిక్స్ వాడుతుంటారు. అయితే, ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో కూడా మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అదెలాగో తెలుసా?

- Advertisement -

చర్మం మృదువుగా..
ఆడవారి స్కిన్‌తో పోల్చుకుంటే.. మగవారి స్కిన్ కొంచెం రఫ్‌గా ఉంటుంది. కాబట్టి ఒక గిన్నెలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, టేబుల్ స్పూన్ చొప్పున తేనె, కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ఎలాంటి సోప్స్ వాడకుండా చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసువాలి. ఇలా చేస్తే.. ముఖంపై ఉండే డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది.

- Advertisement -

పొడిబారనివ్వదు..
ముఖం కాంతివంతంగా కనిపించాలంటే.. టమాటా, బొప్పాయి, ఆరెంజ్ వంటి పండ్లను ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ముఖం పొడిబారినట్లుగా అనిపిస్తే.. నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది ముఖంపై తేమను నిలిపి ఉంచి, పొడిబారనివ్వకుండా చేస్తుంది. ఇక రాత్రి పడుకునే ముందు ఐస్ క్యూబ్‌తో ముఖంపై రుద్దటం వలన చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News