BigTV English

Dravid’s Surprise Message To Gambhir: ద్రవిడ్ సందేశం.. గంభీర్ భావోద్వేగం

Dravid’s Surprise Message To Gambhir: ద్రవిడ్ సందేశం.. గంభీర్ భావోద్వేగం

Rahul Dravid gives a special surprise to new head coach Gautam Gambhir: టీమ్ ఇండియా కొత్త కోచ్ గా గౌతంగంభీర్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మొత్తానికి తన ఎంట్రీయే బాలీవుడ్ హీరో లెవెల్లో వచ్చింది. తన సపోర్టింగ్ టీమ్ ని తనే తెచ్చుకున్నాడు. తనకి నచ్చిన కెప్టెన్ ని పెట్టుకున్నాడు. సీనియర్లు రోహిత్, కొహ్లీ, రవీంద్రలను గౌరవించాడు. కథంతా సాఫీగా సాగిపోయింది. ఈ సమయంలో ఒక ట్విస్ట్ వచ్చింది. అదేమిటంటే ఇంతవరకు టీమ్ ఇండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఒక వాయిస్ మెసేజ్ ని గౌతంగంభీర్ కి పంపించాడు. దానిని బీసీసీఐ విడుదల చేసింది. అది విన్న గంభీర్ ఉద్వేగభరితుడయ్యాడు.


ఇంతకీ ద్రవిడ్ ఏమన్నాడంటే.. టీమ్ ఇండియా కోచ్ గా నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అప్పుడే నా ప్రయాణం ముగిసి మూడు వారాలవుతోంది. నా జీవిత కాలంలో నెరవేరని కలలను టీ 20 ప్రపంచకప్ తో నెరవేర్చుకున్నాను. ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. వాటిని నువ్వు నెరవేరుస్తావని ఆశిస్తున్నాను.

ఇక నీతో కలిసి ఎన్నో మ్యాచ్ లు ఆడాను. ఆ రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి.  బ్యాటింగ్ లో నీ సహకారం, ఫీల్డింగులో నీ చురుకుదనం, ప్రతి మ్యాచ్ గెలవాలనే కసి, పట్టుదల అన్నీ ఒక సహచరుడిగా నిన్ను  అత్యంత దగ్గరగా చూశాను.


కోల్ కతా కెప్టెన్ గా, మెంటార్ గా కూడా నువ్వు అద్వితీయమైన విజయాలు సాధించావు. క్రీడాకారుల్లో దాగిన ప్రతిభను వెలికితీసే విధానం నాకెంతో నచ్చింది. నిజానికి ఎవరైనా గొప్ప క్రీడాకారుడైతే, అతని వెనుక నిలుచునే విధానం నాకెంతో నచ్చిందని అన్నాడు. బహుశా అది శ్రేయాస్ అయ్యర్ ని ద్రష్టిలో పెట్టుకుని అన్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీమ్ ఇండియాతో గడిపే ఒక అత్యద్భుతమైన సమయాన్ని నువ్వు ఇక నుంచి ఆస్వాదిస్తావని భావిస్తున్నానని అన్నాడు.

ఇకపోతే జట్టులో అందరూ ఫిట్ గా ఉన్నారు. అంతేకాదు ఇన్ని ఉన్నా అదృష్టం కూడా ఒకొక్కసారి కలిసి రావాలి. అది నీకు పుష్కలంగా ఉందని భావిస్తున్నా అన్నాడు. ఎందుకంటే నువ్వు రెండు ప్రపంచకప్ లు గెలిచిన టీమ్ లో సభ్యుడిగా ఉన్నావు. ఇప్పుడు కూడా అదే రీతిలో నువ్వు సాధించి భారతదేశ గౌరవాన్ని ఇనుమడింప చేస్తావని ఆశిస్తున్నాను. బహుశా వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ విషయమై చెప్పి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు.

Also Read: కొత్త కోచ్ గంభీర్.. మొదటి మ్యాచ్.. నేడే ఇండియా వర్సెస్ శ్రీలంక టీ 20

అలాగే భారతదేశంపై నీకున్న అంకిత భావం చాలా గొప్పది. అది నేను ప్రత్యక్షంగా చూశాను. జట్టు ఎంతో క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఆడిన విధానం నాకిప్పటికి గుర్తుంది. ఇకపోతే ప్రస్తుతం టీమ్ ఇండియాలో నువ్వెప్పటికి ఒంటరివాడివి కావు. ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, మేనేజ్మెంట్ నుంచి ఎల్లవేళలా నీకు సంపూర్ణ మద్దతు అందుతుంది. అని ద్రవిడ్ అన్నాడు. అంటూనే చివరికి ఒక ఝలక్ ఇచ్చాడు.

అదేమిటంటే, ఎప్పుడూ సీరియస్ గా కాకుండా, అప్పుడప్పుడు చిరునవ్వుతో కనిపించు అని సుతిమెత్తగా చెప్పి ముగించాడు. ద్రవిడ్ సందేశం విన్న గంభీర్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. తన మాటలకు ఎలా స్పందించాలో తెలీడం లేదని అన్నాడు. కానీ ద్రవిడ్ నుంచి ఎన్నో విలువైన పాఠాలను నేనే కాదు, నా తర్వాత తరం కూడా నేర్చుకోవాల్సింది ఉందని అన్నాడు. ద్రవిడ్ గర్వపడేలా కోచ్ పదవికి వన్నెతెస్తానని అన్నాడు.

">

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×