Big Stories

India vs Australia 3rd T20 : మ్యాక్స్‌వెల్ సూపర్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన భారత్

India vs Australia 3rd T20 Highlights

India vs Australia 3rd T20 Highlights(Latest sports news telugu):

వరుస విజయాలతో సూర్యకుమార్ కెప్టెన్సీలో ధనాధన్ ఆడుతున్న టీమ్ ఇండియా మూడో వన్డేలో బోల్తా పడింది. ఇండియా-ఆసిస్ మధ్య గౌహతీలో జరిగిన మూడో టీ 20 లో ఆఖరి బాల్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా నడిచింది. చివరికి ఆసిస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎట్టకేలకు టీమ్ ఇండియాకు సిరీస్ వెళ్లకుండా అడ్డుపడింది. ప్రస్తుతం 2-1తో రేస్ లో నిలిచింది.

- Advertisement -

మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా కుర్రాళ్లు 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేశారు. తర్వాత ఛేజింగ్ లో ఆస్ట్రేలియా 5 వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. ఇండియాలో రుతురాజ్ గైక్వాడ్ చేసిన సూపర్ సెంచరీ వృధా అయ్యింది. అదే రేంజ్ లో ఆసిస్ నుంచి మ్యాక్స్ వెల్ చేసిన సెంచరీ విజయాన్ని అందించింది.

- Advertisement -

టాస్ ఓడిన ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైపాల్ ఆత్మ విశ్వాసంతోనే ప్రారంభించారు. అయితే కొత్త బంతి వేగంగా వస్తుంటే మొదట్లో ఓపెనర్లు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో యశస్వి (6) స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.

ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ కి వచ్చిన ఇషాంత్ కిషన్ కొత్త బంతిని ఎదుర్కోడానికి ఇబ్బంది పడ్డాడు. ఆ తడబాటులోనే పరుగులేమీ చేయకుండా క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అప్పటికి టీమ్ ఇండియా 2.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. చాలా క్లిష్టమైన దశ. ఈ సమయంలో కెప్టెన్ సూర్య కుమార్ వచ్చాడు. తను మొదట్లో డిఫెన్స్ ఆడాడు. కొంచెం క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ కి పని అప్పజెప్పాడు.

29 బాల్స్ లో 2 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేసి వెనుతిరిగాడు. తను అవుట్ అయ్యే సమయానికి ఇండియా 10.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.  అప్పుడు సెకండ్ డౌన్ తిలక్ వర్మ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. స్పీడుగానే ఆడాడు.

రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అద్భుతమైన మ్యాచ్ ఆడినట్టే చెప్పాలి. ఎందుకంటే 57 బాల్స్ లో 7 సిక్స్ లు, 13 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ విధ్వంసానికి ఇండియా చివరి 10 ఓవర్లలో 142 పరుగులు చేసింది. అంటే తిలక్ వర్మ తో కలిసి ఎంత దూకుడుగా ఆడారో అర్థమవుతుంది. ఎంతచేసినా బౌలర్లు ఆ స్కోర్ ని కాపాడలేకపోయారు.

ఆసిస్ బౌలింగ్ లో రిచర్డ్ సన్, జాసన్, ఆరన్ హార్డీ ముగ్గూరు తలా ఒక వికెట్ తీసుకున్నారు. మొత్తానికి ఇండియా డిఫెండ్ చేసుకోవాల్సిన స్కోరే. అందుకు తగినట్టుగానే త్వరత్వరగా ఆసిస్ 5 వికెట్లు తీశారు. ఎంత చేసినా అవతలివైపు మ్యాక్స్ వెల్ ఉండిపోయాడు. అడ్డంగా నిలబడిపోయాడు.

ఒకానొక సమయంలో కెప్టెన్ సూర్యకి క్యాచ్ ఇచ్చాడు. చేతిలో పడిన దాన్ని అనూహ్యంగా వదిలేయడంతో, మ్యాక్స్ వెల్ రెచ్చిపోయి 48 బాల్స్ లో 8 సిక్స్ లు, 8 ఫోర్ల సాయంతో 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివరి బాల్ కి ఆసిస్ కి విజయాన్ని అందించాడు. కొండలా కనిపించిన స్కోరుని అలా సిక్స్ లు, ఫోర్లు కొట్టి కరిగించేశాడు.

223 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసిస్ మొదట్లో చాలా దూకుడుగానే మొదలు పెట్టింది. అంతే దూకుడుగా వికెట్లు కూడా సమర్పించుకుంది. ఓపెనర్ గా వచ్చిన ట్రావెస్ హెడ్ 18 బాల్స్ లో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

మరో ఓపెనర్ ఆరాన్ హార్డీ (16) అవుట్ అయ్యాడు. తర్వాత జోష్ ఇంగ్లిస్ (10) తను అయిపోయాడు. ఆసిస్ అప్పటికి 6.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసి, ఏటికి ఎదురీదుతోంది. తర్వాత మాక్స్ వెల్ వచ్చాడు. కానీ అతనికి సపోర్ట్ గా తర్వాత వచ్చిన స్టోనిస్ (17), టిమ్ డేవిడ్ (0) నిలవ లేదు. కాకపోతే కెప్టెన్ మాథ్యూ వాడే (28 నాటౌట్) వచ్చి, సింగిల్స్ తీస్తూ మ్యాక్స్ వెల్ కి స్ట్రయికింగ్ ఇచ్చాడు. దాంతో తను రెచ్చిపోయి సెంచరీ చేసి ఆసిస్ ని ఒంటి చేత్తో గెలిపించాడు.

ఇండియా బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ 1, రవి బిష్ణోయ్ 2, ఆవేష్ ఖాన్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఆసిస్ బోణి కొట్టింది. మళ్లీ రేస్ లోకి వచ్చింది. 2-1తో నిలిచింది.

నాలుగో టీ 20 డిసెంబర్ 1న నాగపూర్ లో జరగనుంది. అప్పుడేమైనా విజయం సాధిస్తారా? లేక సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పీకల మీదకి తెచ్చుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News