Big Stories

Odisha Crime: దారుణం.. యువతిని హత్య చేసి 31 ముక్కలుగా నరికిన దంపతులు

Odisha Crime: మహిళను హత్య చేసి.. ఆమె మృతదేహాన్ని 31 ముక్కలుగా నరికి పాతిపెట్టిన దారుణ ఘటన ఒడిశాలో జరిగింది. నబరంగ్ పూర్ జిల్లా రాయ్ ఘర్ పోలీసు పరిధిలోని మురుమడిహి సమీపంలోని అడవిలో జరిగిందీ ఘటన. ఈ కేసులో పోలీసులు ఓ జంటను అరెస్ట్ చేశారు. మురుమడిహి గ్రామానికి చెందిన చంద్ర రౌత్ దంపతులను.. బఘబెడ గ్రామానికి చెందిన తిలాబతి గోండ్ హత్యలో రాయ్ ఘర్ పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే మహిళ హత్య జరిగినట్లు ఎస్ డీపీఓ ఆదిత్య సేన్ తెలిపారు. మృతురాలిని తిలాబదిగా గుర్తించామన్నారు. ఈ ఘటన కొన్ని నెలల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యోదంతాన్ని గుర్తుచేసింది.

- Advertisement -

ఎస్ డీపీఓ ఆదిత్యసేన్ తెలిపిన వివరాల మేరకు.. బాఘబెడ గ్రామానికి చెందిన లుథురామ్ కుమార్తె తిలాబతి గోండ్ (23) గురువారం (నవంబర్23) సాయంత్రం తన స్నేహితురాలింటికి వెళ్లొస్తానని చెప్పింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కలంతా వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో.. శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.

- Advertisement -

బారసుండి గ్రామానికి చెందిన చంద్రరౌత్ తిలాబతిని ప్రేమించాడు. అప్పటికే అతనికి సియాబతి అనే యువతితో వివాహమైంది. తొలుత అతడి ప్రేమను నిరాకరించిన ఆమె.. అతను వదలకుండా వెంట పడుతుండటంతో.. నిజమేనని భావించి.. అతనిమైకంలో మునిగిపోయింది. తీరా పెళ్లిప్రస్తావన తీసుకొచ్చేసరికి ప్లేటు ఫిరాయించాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే.. ఇక్కడే ఉంటానని గురువారం అతడి ఇంటికెళ్లి గొడవచేసింది. దాంతా.. చంద్రరౌత్, సియాబతి, తిలాబతిల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో దంపతులిద్దరూ కలిసి ఆమెను హతమార్చారు. మృతదేహాన్ని మురుమడిహి అడవిలోకి తీసుకెళ్లి 31 ముక్కలుగా నరికి పాతిపెట్టి పరారయ్యారు. ఈ దారుణాన్ని చూసిన జుగుసాయి అనే వ్యక్తి.. జరిగిందంతా గ్రామస్తులకు చెప్పగా పోలీసులకు సమాచారమిచ్చారు. తిలాబతి శరీరభాగాలను పాతిపెట్టిన చోట వెలికి తీసి, పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఘటనా స్థలంలో కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతుందని, అది పూర్తైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా.. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ.. మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాయ్ ఘర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తన మేనకోడలిని దారుణంగా హత్యచేసి, 31 ముక్కలుగా నరికిన దోషులను కఠినంగా శిక్షించాలని మృతురాలి మేనమామ డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News