Big Stories

Satellites Short: సగం శాటిలైట్లు స్పేస్-ఎక్స్‌వే !

Satellites Short: భూకక్ష్యలో 7 వేలకు పైగా ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. కమ్యూనికేషన్, నేవిగేషన్, సైంటిఫిక్ రిసెర్చి కోసం వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. గత ఏడాదిలోనే 150 ఉపగ్రహాలను రోదసిలోకి పంపారు. రానున్న దశాబ్దకాలంలో మరెన్నో శాటిలైట్లు భూకక్ష్యలోకి చేరనున్నాయి.

- Advertisement -

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్-ఎక్స్ ప్రయోగించినవే వీటిలో అత్యధికంగా ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపగ్రహాల్లో దాదాపు సగం ఆ సంస్థవే. ఈ ఏడాది ఇప్పటివరకు 62 మిషన్లను స్పేస్-ఎక్స్ చేపట్టింది. అమెరికాకు చెందిన ఆ సంస్థ శాటిలైట్లు 3395 వరకు పని చేస్తున్నాయి.

- Advertisement -

బ్రిటన్‌కు చెందిన వన్ వెబ్ శాటిలైట్స్ 502 ఉపగ్రహాలను ప్రయోగించింది. మొత్తం ఉపగ్రహాల్లో ఆ సంస్థ వాటా 7శాతంగా ఉంది. 369 ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా ప్రభుత్వం మూడో స్థానంలో ఉంది. ఇది ఐదు శాతానికి సమానం. అమెరికా ప్రభుత్వం 306 శాటిలైట్లను(4 శాతం) ప్రయోగించింది.

అమెరికాకే చెందిన ప్లానెట్ లాబ్స్ ఉపగ్రహాలు 195(3 శాతం) వరకు భూకక్ష్యలో ఉన్నాయి. రష్యన్ ఫెడరేషన్ 137(2 శాతం) ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. అమెరికా కంపెనీలు స్వామ్ టెక్నాలజీస్, ఇరిడియం కమ్యూనికేషన్స్ 84, 75 చొప్పున శాటిలైట్లను ప్రయోగించింది.

2022లో అంతరిక్ష ప్రయోగాలపై అమెరికా వెచ్చించిన మొత్తం 62 బిలియన్ డాలర్లు. చైనా ఖర్చు చేసిన దాని కంటే ఈ మొత్తం ఐదు రెట్లు ఎక్కువ. అయితే గత రెండు దశాబ్దాల కాలంలో అంతరిక్ష కార్యక్రమాల్లో చైనా తన దూకుడును పెంచింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News