E-Paper
Advertisement

Janhvi Kapoor: ఈమె.. ఎన్టీఆర్ గురించి చెప్పి చెప్పి ఫ్యాన్స్ ను చంపేసేలా ఉందే

Janhvi Kapoor: ఈమె.. ఎన్టీఆర్ గురించి చెప్పి చెప్పి ఫ్యాన్స్ ను చంపేసేలా ఉందే
Advertisement

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం.. దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. దేవర కన్నా ముందు ఎన్నో మంచి అవకాశాలు వచ్చినా.. జాన్వీ మాత్రం ఎన్టీఆర్ తోనే నటించాలని కోరుకుంది. దానికోసం పూజలు కూడా చేసిందంట. ఇక దేవుడు కనికరించి అమ్మడి అదృష్టం పండింది.

ఇక ఏ ముహూర్తాన దేవర సినిమా మీద సైన్ పెట్టిందో.. అప్పటినుంచి జాన్వీ ఆనందానికి అవధులు లేవు. దేవర షూటింగ్ మొదలైనప్పటి నుంచి జాన్వీ.. ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతుంది. అది కూడా అలా ఇలా కాదు. ఓ రేంజ్ లో. ఎన్టీఆర్ తో చేయడం తన అదృష్టమని, ఆయన సూపర్ అని, ఆయన యాక్టింగ్ లో అడ్రస్ అని.. ఇలా ఒకటేమిటి.. ఆమె ఏది చెప్పినా దేవర సినిమాపై అంచనాలును పెంచేస్తూనే ఉంది.

Advertisement

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అంటే జాన్వీనే అని చెప్పాలి. అందాల అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఈ చిన్నదానికి తెలుగువారిలో ఒక గుర్తింపు ఉంది. ఇక ఫోటోషూట్స్ తో, అందాల ఆరబోతతో తనకంటూ మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది.

ఇక ఇప్పుడు ఆమె ప్రత్యేకంగా హైప్ సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ, జాన్వీ మాత్రం ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా .. ఏ షోకు వెళ్లినా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ హైలైట్ గా నిలుస్తుంది. అభిమానిగా ఆమె చెప్తుందో.. హైలైట్ అవ్వాలని చెప్తుందో అర్ధమే కావడం లేదని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఈమె.. ఎన్టీఆర్ గురించి చెప్పి చెప్పి ఫ్యాన్స్ ను చంపేసేలా ఉందే అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ చిన్నదాని ఆశలు.. దేవరతో నెరవేరుతాయా.. ? లేక అంతకు ముందు బాలీవుడ్ హీరోయిన్స్ లా మొదటి సినిమాతో పరాజయాన్ని చవిచూస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×