BigTV English
Advertisement

Akkineni Nagarjuna: రజినీ సినిమాను రిజెక్ట్ చేసిన నాగ్.. ఎందుకంటే ..?

Akkineni Nagarjuna: రజినీ సినిమాను రిజెక్ట్ చేసిన నాగ్.. ఎందుకంటే ..?

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో పోలిస్తే కొంచెం వెనుకబడ్డాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సీనియర్ హీరోలు వరుస సినిమాలను లైన్లో పెట్టి, కుర్ర డైరెక్టర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. కానీ, నాగ్ మాత్రం ఆశ్చితుచి అడుగులు వేస్తున్నాడు.


అసలు సినిమాలు చేయడం ఇష్టం లేకనో.. కథలు దొరక్కనో అనేది పక్కన పెడితే.. ఈ ఏడాది నా సామీ రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఈ సినిమా తరువాత నాగ్ మళ్లీ అదే పరిస్థితి. ఎలాంటి కథలను ఎంచుకోవాలా.. ? అని. ఇక ఆ సమయంలోనే శేఖర్ కమ్ముల కుబేర సినిమాలో నాగ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు.

ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో నాగ్.. ఒక పోలీస్ అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే నాగ్ లుక్ రిలీజ్ అయ్యి మంచి హైప్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా కాకుండా నాగ్ ప్రస్తుతం బిగ్ బాస్ 8 కు ప్రిపేర్ అవుతున్నాడు. గత 5 సీజన్స్ కు ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే.. ఈ మధ్య నాగ్ గురించి ఒక వార్త చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే.


రజినీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో నాగ్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని రోల్ చేయబోతున్నాడని, రజినీకి ధీటుగా ఉండే పాత్ర అని కూడా చెప్పుకొచ్చారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. నాగ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడని అంటున్నారు. కథ నచ్చక, పాత్ర నచ్చక కాదు కానీ, ఇప్పుడప్పుడే ఇలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదని తేల్చి చెప్పాడట. దీంతో నాగ్ విలన్ గా చేస్తున్నాడు అనేది ఇక లేనట్టే అని చెప్పాలి. ఇక నాగ్ ప్లేస్ లో అంతటి రేంజ్ ఉన్న స్టార్ హీరో కోసం లోకేష్ వెతుకుంటున్నాడని టాక్. ఈ విషయం తెలియడంతో నాగ్ అభిమానులు.. కింగ్.. విలన్ గా చేస్తాడని ఎలా అనుకున్నార్రా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలి.

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×