BigTV English

Viral Video: కూతురిని ఎదురుగా పెట్టుకుని ప్రమాదకరమైన విన్యాసాలు..

Viral Video: కూతురిని ఎదురుగా పెట్టుకుని ప్రమాదకరమైన విన్యాసాలు..

Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తుంటాయి. ఇందులో యాక్సిడెంట్లకు సంబంధించిన వీడియోలు ఇటీవల విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్లపై వాహనాలు నడిపే క్రమంలో జాగ్రత్తగా ఉన్నా కొన్ని సార్లు చేసే తప్పిదాల కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఇలా ఎన్నో ఘటనలు వెలుగుచూస్తున్నా కూడా కొంతమంది వాహనదారులు మాత్రం అస్సలు జాగ్రత్తలు పాటించడం లేదు. అశ్రద్ధగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కేవలం సోషల్ మీడియాలో వీడియోల కోసం తాము చేసే పని ప్రమాదమా లేదా అని కూడా ఆలోచించడం లేదు. తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైలర్ అవుతోంది.


ఓ తండ్రి తన కూతురితో కలిసి డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలు చేశాడు. చిన్న వయసున్న కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని కారు డ్రైవింగ్ చేస్తూ తనతో ముచ్చట్లు పెడుతూ వెళ్తున్నాడు. ఈ తరుణంలో తన పక్క సీట్లో కూర్చుని ఉన్న వారు వీడియోను తీస్తున్నారు. అప్పటి వరకు తన ఒడిలో పడుకుని ఉన్న కూతురు, లేచి తనతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఈ తరుణంలో వాహనం నడుపుతూ తన కూతురికి కబుర్లు చెబుతూ వెళ్లాడు. అయితే ఇలా చేయడం వల్ల స్టీరింగ్ అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా స్టీరింగ్ చిన్న పాపకు తలకు తగిలితే ఇద్దరి ప్రాణాలు పోతాయని రోడ్డుపై రద్దీ ఉన్న సమయంలో ఇలాంటి విన్యాసాలు చేయడం కూడా ప్రమాదమని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు తరచూ ఎన్నో వస్తున్నా కూడా కొంచెం కూడా జాగ్రత్తలు పాటించడం లేదని మండిపడుతున్నారు.


Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×