BigTV English
Advertisement

Genelia: స్టార్ హీరో పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ఏజ్ బార్ బ్యూటీ

Genelia: స్టార్ హీరో పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ఏజ్ బార్ బ్యూటీ

Genelia: జెనీలియా, ఒక్కప్పుడు స్టార్ హీరోల సరసన నటించి.. కుర్ర కారుకు కునుకు లేకుండా చేసిన హీరోయిన్. ఆ తర్వాత మెల్లిగా బాలీవుడ్ కి చేరిన ఈ బ్యూటీ ,పెళ్లి తర్వాత ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకుంది. తిరిగి గత కొద్ది కాలంగా బ్యాక్ టు బ్యాక్‌ వెబ్ సిరీస్‌ లతో బిజీగా గా ఉంది. అయితే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ స్టార్ హీరో తో సినిమా నటించబోతోంది అన్న విషయం పెద్ద వైరల్ న్యూస్ గా మారింది. జెనీలియా పేరు చెప్తే ఇప్పటికీ బొమ్మరిల్లు మూవీ లో హ..హ.. హాసిని క్యారెక్టర్ గుర్తుకొస్తుంది.


బొమ్మరిల్లు మూవీ లో ‘వీలైతే నాలుగు మాటలు ,కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ఆమాయకంగా హాసిని క్యారెక్టర్ లో జెనీలియా చెప్పే మాటలు ఎంత క్యూట్ గా ఉంటాయో కదా. ప్రస్తుతం జనరేషన్ కిడ్స్ కి బొమ్మరిల్లు మూవీ జెనీలియా రేంజ్ ఏంటో తెలియకపోవచ్చు. కానీ 1980, 1990 మధ్య పిల్లలకు బొమ్మరిల్లు ఒక సెన్సేషనల్ మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బొమ్మరిల్లు బ్యూటీ టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది.

అమితాబ్ బచ్చన్ తో చేసిన పార్కర్ పెన్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా జెనీలియా గుర్తింపు పొందింది. 2003 లో విడుదలైన హిందీ మూవీ తుజే మేరీ కసమ్ ద్వారా రితీష్ దేశ్‌ముఖ్ తో కలిసి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది జెనీలియా. బాయ్స్, సత్యం, సాంబ, సుభాష్ చంద్రబోస్, సై, బొమ్మరిల్లు, ఆరంజ్ లాంటి చాలా సినిమాలు తెలుగు లో చేసింది. అయితే పెళ్లి, పిల్లల తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి తన భర్త రితీష్ దేశ్‌ముఖ్ తో వేద్ అనే మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తెలుగులో చైతన్య, సమంత కాంబో లో వచ్చిన మజిలీ మూవీ కు రీమేక్‌.


ఎంట్రీ , రీ ఎంట్రీ మూవీ రెండూ తన లక్కీ స్టార్ కమ్ హస్బెండ్ తో ఇచ్చినందుకో లేక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు గడుస్తున్నా ఫస్ట్ మూవీ లో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉండడం వల్లనో ఏమో తెలియదు కానీ.. మొత్తానికి జెనీలియాకి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. మంచి వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న జెనీలియాకి అమీర్ ఖాన్ చిత్రంలో నటించే సూపర్ డూపర్ ఆఫర్ వచ్చింది. ఆర్‌ ఎస్ ప్రసన్న డైరెక్షన్ లో ఆమీర్ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న సితారే జమీన్‌ పర్‌ అనే మూవీలో జెనీలియా హీరోయిన్ గా నటిస్తుంది.

మామూలుగా జెనీలియాతో పాటు కెరీర్ మొదలు పెట్టిన ఎందరో స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం స్పెషల్ క్యారెక్టర్స్ కు పరిమితం అయితే జెనీలియా మాత్రం హీరోయిన్ గా ,అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో నటించే ఆఫర్ రావడం నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం. అలాగని అమీర్ ఖాన్ ఏమీ కుర్ర హీరో అనడం లేదు…కానీ 60 లకు వస్తున్న సినీ ఇండస్ట్రీలో హీరోలు .. హీరోలు గానే ఉంటారు. కానీ హీరోయిన్లు మాత్రం క్రమంగా అక్క ,వదిన క్యారెక్టర్స్ చేసి ఆ తర్వాత అమ్మ, అత్త క్యారెక్టర్స్ వరకు వెళ్తారు.కానీ ఈ వయసులో కూడా స్టార్‌ హీరో మూవీ లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన జెనీలియా ఈ మూవీ హిట్ అయితే మాత్రం
మళ్లీ బిజీ అయిపోతుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×