Big Stories

Colon Cancer in Youth: యువతకు పెద్దపేగు క్యాన్సర్ ముప్పు.. కారణమిదే..!

Reasons for Colon Cancer in Youth: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం అవుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. గత పదేళ్లలోనే క్యాన్సర్ కేసులు ఏకంగా 28 శాతం పెరిగాయి అంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. క్యాన్సర్ పెద్ద వయస్సు వారికి వచ్చే వ్యాధి అని డాక్టర్లు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం యుక్త వయస్సు వారు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.

- Advertisement -

పెద్ద పేగు లేదా పురీషనాళంలో వచ్చే క్యాన్సర్ ను కోలెన్ క్యాన్సర్ అంటారు. ఆహారపు అలవాట్లు, జీవన శైలి సరిగ్గా లేకపోవడం కోలన్ క్యాన్సర్ కు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ తినే ట్రెండ్ చాలా పెరిగింది. దీంతో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు ప్రారంభంలోనే గుర్తించడం కష్టం. పొగాకు తీసుకునే వారిలో దాన్ని ప్రారంభించిన దాదాపు 10 నుంచి 20 ఏళ్ల తర్వాత క్యాన్సర్ వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

చాలా మంది యువతకు సిగరెట్ అలవాటు ఉంటుంది. దీని వల్ల చాలా మందికి ఓరల్, లంగ్, పాంక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ప్రధానంగా పొగాకు, మద్యం సేవించడం, పొడవుకు తగిన బరువు కన్నా ఎక్కువగా ఉండటం, ఆహారంలో పండ్లు, కూరగాయల వినియోగం తగ్గించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం  ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Also Read: హైడ్రేటెడ్‌గా ఉండాలనుకుంటున్నారా ? అయితే ఈ ఆయుర్వేద చిట్కాలు మీ కోసమే..

సిగరెట్ తాగడం, ఆల్కహాల్ సేవించడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అధిక కొవ్వు, కేలరీలు, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. యువత ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్స్ తింటున్నారు. దీంతో చాలా మంది చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్నారు. అలాగే ఊబకాయం సమస్య కూడా పెరిగి అనేక అనారోగ్య సమస్యను ఎదుర్కుంటున్నారు.

పెద్ద పేగు కాన్సర్ సంకేతాలు, లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ ఐదు ముఖ్యమైన సూచికలను యువత గమనించాలి. పేగు పనితీరులో మార్పులు, మలంలో రక్తం, కడుపు నొప్పి, బరువు తగ్గడం, అలసట లక్షణాలతో పాటు కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం ఉండే మలబద్ధకం వంటి ఆకస్మిక మార్పును మీరు గమనించినట్లయితే అది పెద్దప్రేగు క్యాన్సర్‌ కావచ్చు. పెద్దప్రేగు క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో మలంలో రక్తం కూడా ఒకటి. ఈ సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ ను సంప్రదించాలి.

(Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. bigtvlive.com దీన్ని ధృవీకరించడం లేదు.)

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News