Big Stories

Saligramam: సాక్షాత్ విష్ణురూపమే.. సాలగ్రామం..!

Saligramam: శివుడు లింగాకృతిలో, విష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడనేది పురాణవచనం. దేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ప్రతిష్టించే శివలింగాలను నర్మదా నదీ గర్భం నుంచి సేకరిస్తుండగా, వైష్ణవాలయాల్లో పూజలందుకునే సాలగ్రామాలను మాత్రం నేపాల్‌లోని గండకీ నది నుంచి సేకరిస్తారు. సాలగ్రామాన్ని అభిషేకిస్తే.. సాక్షాత్తు విష్ణువుని నేరుగా సేవించినట్లే అని పెద్దల మాట.

- Advertisement -

సాలగ్రామంపై ఉండే చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తారు. సాలగ్రామంపై ఒకే చక్రం ఉంటే.. సుదర్శనమని, రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ అని, మూడు ఉంటే అచ్యుతుడనీ, నాలుగుంటే జనార్ధుడనీ, ఐదు చక్రాలు ఉంటే వాసుదేవుడనీ, ఆరు ఉంటే ప్రద్యుమ్నుడనీ, ఏడు ఉంటే సంకర్షణుడు అనీ, ఎనిమిది ఉంటే పురుషోత్తముడు అనీ, తొమ్మిది ఉంటే నవవ్యూహమని, పది చక్రాలుంటే దశావతారమనీ అంటారు. ఇక.. పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడు అని, పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు అనీ, అంతకంటే ఎక్కువ చక్రాలుంటే అనంతమూర్తి అని పిలుస్తుంటారు.

- Advertisement -

విష్ణువు ‘సాలగ్రామం’గా మారటం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కాలనేమి కుమార్తె అయిన బృంద… జలంధరుడు అనే రాక్షసుడిని వివాహమాడుతుంది. బృంద మహా పతివ్రత. కానీ.. జలంధరుడు అందరినీ పీడిస్తుంటాడు. ఒకరోజు.. జలంధరుడు ఏకంగా శివుడి రూపంలో పార్వతీదేవిని చేరేందుకు ప్రయత్నించగా, ఆమె గ్రహించి.. ఇలాగే అతని ఇంటా జరిగితే తప్ప ఇతడి ధోరణిలో మార్పురాదని అనుకొని, మనసులో విష్ణువును తలచుకుంటుంది. దీంతో విష్ణువు.. జలంధరుడి వేషంలో బృందను మోసగించి, అనంతరం తన నిజరూపాన్ని ప్రదర్శిస్తాడు. దీంతో ఆగ్రహానికి లోనైన బృంద విష్ణువును రాయిగా మారమని శపించటంతో విష్ణువు సాలగ్రామ రూపాన్ని ధరించాడని కథ.

‘సాలగ్రామం’ సాక్షాత్ విష్ణుస్వరూపం. దీనిని నిత్యం అభిషేకించి, ఆ జలాన్ని చల్లుకుంటే పాపాలు, రోగాలు నశించి, సర్వశుభాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషివాక్కు. సాలగ్రామం ఎంత చిన్నదిగా ఉంటే అంత శ్రేష్టమైనదిగా భావిస్తారు.
ఇంట్లో సాలగ్రామాన్ని నిత్యం ఆవుపాలతోగానీ, పంచామృతంతోగానీ అభిషేకించాలి. నిత్యం నైవేద్య సమర్పణ చేయాలి.

ఇంట్లో పూజలందుకునే సాలగ్రామాన్ని బయటివారికి చూపించటం నిషేధం.

సాలగ్రామ పూజ చేస్తే శివకేశవులను పూజించిన ఫలితం కలుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News