BigTV English

5 Pranas: పంచ ప్రాణాలు – దశ వాయువులు

5 Pranas: పంచ ప్రాణాలు – దశ వాయువులు

5 Pranas: శ్వాస తీసుకున్నప్పడు మన శరీరంలో ప్రవేశించే వాయువు.. శరీరంలో ప్రవేశించిన తర్వాత.. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే ఐదు వాయువులుగా మారుతుంది. వాటినే పంచప్రాణాలు అంటారు. వాటి వివరాలు


ప్రాణ వాయువు: శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని శరీర కణాలకు చేరే వాయువు. ఇది లేనప్పడు.. ఆ జీవి చనిపోయినట్లు నిర్ధారిస్తారు.

అపాన : ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములను శరీరం నుంచి బయటికి పంపే వాయువు


వ్యాన: శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణమయ్యే వాయువు.

ఉదాన: మాట్లాడేందుకు అవసరమైన, మాట్లాడినప్పడు విడుదలయ్యే వాయువు

సమాన: తీసుకున్న ఆహారం జీర్ణమవటానికి అవసరమయ్యే వాయువు

పైన చెప్పుకున్న పంచప్రాణాలలకు అనుబంధంగా మన శరీరంలో మరో 5 ఉపప్రాణాలుంటాయి. అవి.. నాగ, కూర్మ, కృకల, ధనంజయ, దేవదత్తం.

నాగ : త్రేన్పుగా వచ్చే గాలి

కూర్మ : రెప్పవేయటానికి కారణమైన గాలి

కృకల : తుమ్మినప్పడు బయటికి వచ్చే గాలి

ధనంజయ : హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు. మనిషి చనిపోయాక కూడా ఇది శరీరంలో అలాగే ఉండి మృతదేహం ఉబ్బేలా చేస్తుంది.

దేవదత్తం : ఆవలించినప్పుడు విడుదల అయ్యే గాలి.

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×