BigTV English

Sri Lanka President Election: సెప్టెంబర్ లో శ్రీలంక ప్రెసిడెంట్ ఎన్నికలు.. 2022 ఆర్థిక సంక్షోభం తరువాత ఇదే తొలి ఎలెక్షన్!

Sri Lanka President Election: సెప్టెంబర్ లో శ్రీలంక ప్రెసిడెంట్ ఎన్నికలు.. 2022 ఆర్థిక సంక్షోభం తరువాత ఇదే తొలి ఎలెక్షన్!

Sri Lanka President Election: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారత పొరుగు దేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్ 21, 2024న జరుగనున్నాయని.. ఆ దేశ ఎన్నికల కమిషన్ శుక్రవారం తెలిపింది. 2022 నుంచి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీ లంక ఆర్థిక సంస్కర్ణలు చేసేందుకు విధానాలు రూపొందించారు. కానీ ఆ సంస్కర్ణలు పూర్తి ఫలించాలంటే ప్రస్తుతం దేశానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరం. దీంతో రానున్న ఎన్నికలు కీలకంగా మారాయి.


శ్రీలంక ఎన్నికల కమిషన్.. శుక్రవారం విడుదల చేసిన గెజెట్ ప్రకారం సెప్టెంబర్ 21 న ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆగస్టు 15లోపు నామినేషన్ సమర్పించాలి. శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమెసింఘె (75) తొలి నామినేషన్ వేయనున్నారని సమాచారం. శ్రీలంకలో.. అధ్యక్ష ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలు గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ‘అసలు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నదా?’ అని ప్రతిపక్ష నాయకులు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సెప్టెంబర్ లో జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు విక్రమెసింఘె తో పాటు శ్రీ లంక మాజీ ఆర్మీ చీఫ్.. ఫీల్డ్ మార్షల్ సరత్ ఫోన్ సెంకా ఎన్నికల బరిలో పోటీ చేస్తారని ప్రకటించారు. ఫీల్డ్ మార్షల్ సరత్ ఫోన్ సెంకా గతంలో ఎల్‌టిటిఈ అంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.


శ్రీలంక సంక్షోభ సమయంలో సాయం చేసిన ఇండియా
శ్రీలంకలో 2002లో తీవ్ర ఆర్థిక సంక్షోభ ఏర్పడింది. 1948లో శ్రీలంకకు స్వాతంత్ర్యం లభించిన తరువాత ఇంతటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడడం ఇదే తొలిసారి. దేశ ఖజానాలో విదేశీ కరెన్సీ తీవ్ర లోటుతోపాటు.. అధికారంలో ఉన్న రాజపక్స కుటుంబం దేశాన్ని దోచుకొని పారిపోవడంతో దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడింది. ప్రజలకు ఆహారం దొరకని దరిద్ర పరిస్థితి. దీంతో గత సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీలంక దివాలా తీసింది. చివరికి ప్రపంచ బ్యాంకు 2.9 బిలియన్ డాలర్ల భారీ రుణం ఇచ్చింది కానీ ప్రజలపై మోయలేనంత రుణభారం మోపింది.

Also Read: పారిస్ రైలు నెట్‌వర్క్ ధ్వంసం చేసిన దుండగులు.. ట్రైన్ లో చిక్కుకున్న ఒలింపిక్స్ క్రీడాకారులు!

2022 జూలై 9న ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన తరువాత ఆ సమయంలో ప్రధాన మంత్రిగా రనిల్ విక్రమెసింఘె ఉన్నారు. ఆ తరువాత అధ్యక్ష బాధ్యతలు ఆయనే చేపట్టవలసి వచ్చింది. శ్రీలంక విదేశీ రుణం పెరుగుతూ పోతున్న క్లిష్ట సమయంలో భారత దేశం.. శ్రీ లంక ప్రజలకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలు అందించేందుకు 4 బిలియన్ డాలర్ల అందించింది. దీంతొ శ్రీలంక ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఆ తరువాత కూడా ఒకసారి పెట్రోలియం ఉత్పత్తులు ఇండియా నుంచి కొనుగోలు చేయడానిక 500 మిలియన్ డాలర్లు లైన్ ఆఫ్ క్రెడిట్ ఏర్పాటు, మరోసారి ఆహార ఉత్పత్తులు, మందులు, ఇంధనం కోసం మరో బిలియన్ డాలర్ల రుణ సదుపాయం కల్పించింది.

ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న విక్రమెసింఘె దేశ ఆర్థిక రంగాన్ని కొంత వరకు గాడిలో పెట్టారు. శ్రీలింక ఎకానమీ 3 శాతం వృద్ధికి సమీపంలో ఉంది. పరిస్థితి మెరుగుపడడంతో జపాన్, చైనా, ఇండియా కలిసి గత నెల వరకు 10 బిలియన్ డాలర్ల అప్పు దశల వారీగా అందిస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నాయి.

అయితే శ్రీలంక ఆర్థికంగా పూర్తిగా ఇంకా కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీలకంగా మారనుంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×