BigTV English

NEW ZEALAND TEAM : న్యూజిలాండ్ బలాబలాలేంటి? టైటిల్ గెలిచే సత్తా ఉందా?

NEW ZEALAND TEAM : న్యూజిలాండ్ బలాబలాలేంటి? టైటిల్ గెలిచే సత్తా ఉందా?
NEW ZEALAND TEAM


NEW ZEALAND TEAM(latest sports news ) : వన్డే ల్లో వరల్డ్ ఛాంపియన్ కావాలన్నదే ఆ జట్టు లక్ష్యం. 48 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. అదృష్టం కలిసిరాలేదు. దురదృష్టం వెంటాడింది. రెండుసార్లు అడుగు దూరంలో వరల్డ్ కప్ మిస్సైంది. ఈసారైనా కప్పు కొట్టాలన్న టార్గెట్ తో 13వ వరల్డ్ కప్ కు సిద్ధమైంది.ఇలా ప్రపంచ కప్ కోసం 5 దశాబ్దాలుగా పోరాడుతున్న టీమ్ న్యూజిలాండ్.

వరల్డ్ కప్ లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేసిన జట్టు కివీస్. లీగ్ దశలో అద్భుతంగా ఆడటం.. నాకౌట్ మ్యాచ్ ల్లో ఓడిపోవడం.. ఈ జట్టు బలహీనత. 2011 ప్రపంచ కప్ వరకు న్యూజిలాండ్ జట్టు సెమీస్ దాటి ముందుకెళ్లలేదు. 2015లో తొలిసారి సెమీస్ లో విజయం సాధించింది. అయితే తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూచింది. 2019 ప్రపంచ కప్ ఫైనల్ లో దురదృష్టవశాత్తు అనూహ్యంగా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది.


న్యూజిలాండ్ జట్టును కేన్ విలియమ్సన్ ముందుండి నడిపించే నాయకుడు. అతడే జట్టుకు వెన్నుముక. ఓపెనర్ డెవాన్ కాన్వే భారీ స్కోర్లు సాధించగల బ్యాటర్. అతడికి తోడుగా కీపర్ టామ్ లాథమ్ ఓపెనర్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఫస్ట్ డౌన్ లో దిగే కేన్ విలియమ్సన్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ను బ్యాలెన్స్ చేస్తున్నాడు.విల్ యంగ్ మరో కీలక బ్యాటర్. మిడిల్ ఆర్డర్ లో డారెల్ మిచెల్, గెన్ ఫిలిప్స్ లాంటి దూకుడుగా ఆడే హిట్టర్స్ తో బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్ మన్ , మిచెల్ సాంట్నర్ లాంటి ఆల్ రౌండర్లు జట్టులో ఉన్నారు.

కివీస్ పేస్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, లూకీ ఫెర్గున్సన్ ,మ్యాట్ హెన్రీ ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన ఫాస్ట్ బౌలర్లు. స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ భారత్ పిచ్ లపై అద్భుతంగా బంతిని తిప్పే నైపుణ్యం ఉన్న బౌలర్లే. పేస్ బౌలింగ్ లో ఆఫన్లు ఉన్నా..స్పిన్ విభాగంలో మాత్రం పూర్తిగా సాంటర్న్, సోధీ పైనే కివీస్ ఆధారపడుతోంది. జట్టులో మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం మైనస్ పాయింట్. పార్ట్ టైమ్ బౌలర్లే మూడో స్పిన్నర్ లోటును భర్తీ చేయాలి. ఆల్ రౌండర్ల ప్రదర్శనపైనే కివీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరి న్యూజిలాండ్ 5 దశాబ్దాల కల నెరవేరుతుందా..? చూడాలి.

Related News

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Big Stories

×