Big Stories

3 Star Players Of Team India: ముగ్గురు టీం ఇండియా స్టార్ ప్లేయర్స్ కు ఇదే చివరి వరల్డ్ కప్

The Last World Cup For The 3 Star Players Of Team India: వరల్డ్ కప్ 2023 ఆతిథ్యం భారత్ ఇవ్వడంతో .. టీమిండియా పై అందరి దృష్టి ఉంది. ఈ టోర్నమెంట్లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో తెలియదు కానీ ఎవరికి వాళ్లు తమ అభిమాన జట్టు విజేతగా నిలవాలి అని ఆశిస్తున్నారు. అక్టోబర్ ఐదు నుంచి ప్రారంభమైన టోర్నమెంట్లో క్రికెట్ అభిమానులు తమ అభిమాన బ్యాటర్ పరుగుల వర్షం కురిపించాలని.. అభిమాన బౌలర్ లెక్కలేనని వికెట్ల తన ఖాతాలో వేసుకోవాలని అనుకోవడం మామూలే. అయితే తన మన పేరం లేకుండా ప్రపంచంలో చాలామంది ఇష్టపడే జట్టు టీం ఇండియా. వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న స్టీమ్ ఇండియాలో ముగ్గురు ఆటగాళ్లకు ఇదే చివరి మెగా టోర్నీ అయ్యే అవకాశం ఉంది అన్న విషయం మీకు తెలుసా? ఇంతకీ ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం పదండి…

- Advertisement -

ఈ ముగ్గురు ఆటగాళ్లు టీమిండియా కి త్రిమూర్తులు లాంటివాళ్ళు.. ఎన్నో సమయాల్లో జట్టుకు వెన్నెముకగా నిలిచి అనేక మ్యాచ్లలో టీం విజయానికి కారణమైన ప్లేయర్స్. ఎంతో ప్రతిష్టాత్మకంగా…ముమ్మరంగా సిద్ధపడిన ఈ మ్యాచ్ ఆ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం చివరి ప్రపంచ కప్ టోర్నీ అయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో కాదు ప్రస్తుత భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.

- Advertisement -

గత రెండు సంవత్సరాలుగా టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలను తన శక్తి మేర నిర్వహిస్తూ వస్తున్న రోహిత్ శర్మకు ఇదే చివరి ప్రపంచ కప్ అయ్యే అవకాశం ఉంది. 2007వ సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్ వయసు 36 సంవత్సరాలు. ఇప్పటికే టీ20 ఫార్మాట్ మ్యాచ్లలో రోహిత్ కనిపించడం కష్టమైపోయింది.. ఇక ఈ ప్రపంచ కప్ తర్వాత నెక్స్ట్ వరల్డ్ కప్ 2027లో జరుగుతుంది. అప్పుడు రోహిత్ ఆ మ్యాచ్ లో పాల్గొనడం ఒక అద్భుతమే అవుతుంది.

ఈ లిస్టులో ఇప్పుడే కాదు ఎప్పటికీ ఉండకూడదు అని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకునే పేరు విరాట్ కోహ్లీ. విధ్వంసకర బ్యాటింగ్ తో తనదైన దూకుడు ఆట ఆడే కోహ్లీ క్రమంగా…ఒక రన్ మెషిన్, చేజ్ మాస్టర్ నుంచి కింగ్ కోహ్లీ గా అవతరించాడు. అటువంటి ప్లేయర్ క్రికెట్ ఫీల్డ్ కి దూరం కావాలి అని ఏ క్రికెట్ అభిమాని భావించడు. అయితే ఇప్పటికే 35 సంవత్సరాల వయసు ఉన్న కోహ్లీ ..మూడు వరల్డ్ కప్ టోర్నీలా అనుభవం తో ఇప్పుడు నాల్గవ వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్స్ తర్వాత ఇక కోహ్లీ ఎక్కువగా టెస్ట్ క్రికెట్ మ్యాచ్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది.

2011 వరల్డ్ కప్ గెలిచిన టీం ఇండియాలో సభ్యుడైన ఆర్ అశ్విన్…ఇప్పుడు 2023 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఆడడమే ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ప్రస్తుతం యువ క్రికెటర్ల జోరు ఎక్కువగా ఉన్న ఈ దశలో ముందు.. ముందు అశ్విన్ కు అవకాశాలు పూర్తిగా తగ్గే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ఇక త్వరలోనే అతని కెరియర్ ముగిసే అవకాశం కూడా ఉంది అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం.

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టీం ఇండియా సభ్యులు:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News