
Pakistan team 2023 : పాకిస్థాన్ నిలకడలేని ప్రదర్శనకు కేరాఫ్ అడ్రస్. టీమ్ స్పిరిట్ తో ఆడితే బలమైన జట్లను ఓడించగల సత్తా ఉంది. చిన్న జట్ల చేతిలోనూ అనూహ్యంగా ఓడిపోవడం ఆ జట్టు బలహీనత. ఈ టీమ్ చివరిసారిగా 1999 వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరుకుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు తుదిపోరుకు చేరలేదు. 2011 భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లోనే సెమీస్ కు వెళ్లింది. ఈ సారి పాక్ టీమ్ బలంగానే ఉంది. ఆ జట్టు ఎలా ఉందో విశ్లేషిద్దాం.
సీనియర్ బ్యాటర్లు ఫకర్ జమాన్, ఇనామ్-వుల్-హక్, బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ టాప్ ఆర్డర్ బలంగా ఉంది. యువ బ్యాటర్లు షాద్ షకీల్, అబ్ధులా షఫీక్, అఘా సల్మాన్ అందుబాటులో ఉన్నారు. ఆల్ రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్ బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించే సత్తా ఉన్న ఆటగాడు. అటు స్పిన్ బౌలర్ గా జట్టుకు ఉపయోగపడుతున్నాడు. స్పినర్లు షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ కు భారత్ పిచ్ లపై మెరుగ్గా రాణించగలరు. షాదాబ్ , నవాజ్ బ్యాట్ తో మెరుపులు మెరించే సత్తా ఉన్న వాళ్లే. షాహిన్ షా ఆఫ్రిది, హరీష్ రవూఫ్ పేస్ బౌలింగ్ బాధ్యతలు మోస్తున్నారు. వారికి హసన్ అలీ , ఉసామా మిర్ తోడుగా ఉన్నారు.
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ పాకిస్థాన్ పటిష్టంగానే ఉంది. అయితే మైదానంలో ఫీల్డర్లు చురుగ్గా కదల్లేకపోవడం ఆ జట్టు బలహీనత. సులభమైన క్యాచ్ లు నేలపాలు చేస్తుంటారు పాక్ ఫీల్డర్లు. మిస్ ఫీల్డింగ్ సాధారణమే. ఫీల్డింగ్ తప్పిదాలు పాక్ జట్టు కొంపముంచే అవకాశాలున్నాయి. నిలకడగా రాణించలేకపోవడం ఈ జట్టు బలహీనత. బ్యాటర్లే కాదు బౌలర్ల ఎప్పుడు ఎలా ఆడతారో అంచనా వేయలేం. జట్టుగా కలిసి ఆడితే పాక్ అడ్డుకోవడం కష్టమే. కానీ పాక్ తడబడితే చిన్నటీమ్స్ చేతిలో ఓటిమి చవిచూస్తుంది.