Big Stories

Asanas for Skin : ఇలా చేస్తే.. వృద్ధాప్య ఛాయలు మాయం

Asanas for Skin

Asanas for Skin: మెరిసే చర్మంతో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ, వాతావరణ మార్పులు, ఆహారం వల్ల పెరిగే వయసుతో పాటే చర్మంపై ముడతలు ఏర్పడి 30 ఏళ్లు రాగానే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. అలా చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు కొన్ని ఆసనాలు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులంటున్నారు. అవేంటో చూద్దాం.

- Advertisement -

హలాసనం
హలాసనం ముఖాన్ని కాంతివంతం చేసి మెరిసేలా చేస్తుంది. ఈ ఆసనం చేయడం వల్ల ముఖంలో రక్తప్రసరణ పెరిగి ముఖంపై మచ్చలు మటుమాయం అవుతాయి.

- Advertisement -

త్రికోణాసనం
త్రికోణాసనం ఆరోగ్యానికే కాక శరీర సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ ఆసనం గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. త్రికోణాసనం చేయడం వల్ల శరీరం రిఫ్రెష్‌గా, ఫిట్‌గానూ ఉంటుంది.

మత్స్యాసనం
మత్స్యాసనం చేయడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతుల్యం అవుతాయి. ఫలితంగా ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు తొలగిపోవడంతో పాటు వృద్ధాప్య ముడతలు మాయమైపోతాయి.

సర్వాంగాసనం
ఈ ఆసనం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల తల వైపు రక్తప్రసరణ జరుగుతుంది. దీంతో ముఖ చర్మానికి మేలు జరుగుతుంది. అంతేకాకుండా జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News