E-Paper
Advertisement

Animal Movie Updates : ఆ 18-నిమిషాలు .. థియేటర్లో అరాచకమే .. యానిమల్ క్రేజీ అప్డేట్..

Animal Movie Updates : ఆ 18-నిమిషాలు .. థియేటర్లో అరాచకమే .. యానిమల్ క్రేజీ అప్డేట్..
Advertisement
Animal Movie Updates

Animal Movie Updates : రణబీర్ కపూర్, రష్మీక కాంబోలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న మూవీ యానిమల్. ఒక్క ట్రైలర్ తో చిత్రంపై అంచనాలను భారీగా పెంచిన ఈ మూవీ గురించి మరొక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ స్టోరీ కి సంబంధించిన ఒక చిన్న వార్త లీక్ అయింది.

వార్త చిన్నదే కానీ దాని ఇంపాక్ట్ మాత్రం భారీగా ఉంది. ఈ మూవీలో ఇంటర్వెల్ కోసం 18 నిమిషాల లాంగ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారట. తండ్రి ,కొడుకుల సెంటిమెంట్ తో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. అత్యంత ఆసక్తికరంగా.. రోమాంచితంగా సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ ను సుప్రీమ్ సుందర్ రూపొందించాడు. ఈ యాక్షన్ సన్నివేశంలో రణబీర్ నటన ఆకట్టుకునే విధంగా ఉందంట. ఇక ఈ సీన్ లో రణబీర్ లోని బహుముఖ ప్రజ్ఞను వీక్షించే అవకాశం కలుగుతుందట.

Advertisement

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో రణబీర్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ అర్థమైంది. ఇప్పటివరకు ఉన్న చాక్లెట్ బాయ్ ఇమేజ్ కు భిన్నంగా ఫుల్ స్వింగ్ యాక్షన్ మోడ్ లో రణబీర్ నిజంగానే టైటిల్ కి తగ్గట్టు యానిమల్ లాగా విజృంభించాడు. ఈ మూవీలో అతని డైలాగ్స్ నుంచి హై-ఆక్టేన్ ఫైట్స్ వరకు ఓ రేంజ్ లో ఉంటాయి అని టాక్. సందీప్ తెలుగులో అర్జున్ రెడ్డి.. హిందీలో కబీర్ సింగ్ మూవీస్ తో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు అతని మూవీ అంటే ఎలా ఉంటుంది అనే విషయం పై ప్రేక్షకులకి ఒక అంచనా ఉంది .అయితే ఈ మూవీలో అంతకుమించి అన్నట్లుగా సన్నివేశాలు ఉంటాయట.

మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు జరిగే ఆ 18 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులని సీట్లో నుంచి కదలనివ్వదట. మూవీ కాస్త లెంగ్త్ ఉన్నా  సరే ఒకసారి స్టార్ట్ అయితే టైం ఎంత గడిచిందో తెలియదట. మరి ఇక ఏ మూవీతో డైరెక్టర్ గా సందీప్ ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ రెండిటిలో సాలిడ్ గా సెటిల్ అవుతాడేమో చూడాలి. ఏ మూవీ డిసెంబర్ 1న గ్రాండ్గా వరల్డ్ వైడ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×