Big Stories

Brain Cancer Symptoms: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే జాగ్రత్త.. మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం

Brain Cancer Symptoms: క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. క్యాన్సర్‌ పేరు వింటేనే ప్రతీ ఒక్కరు భయబ్రాంతులకు గురవుతుంటారు. మెదడుతో సహా శరీరంలోని వివిధ భాగాలను క్యాన్సర్ ప్రభావితం చేస్తుంది. ఇందులో అతి ప్రాణాంతకరమైనదే మెదడు క్యాన్సర్. తరచూగా 75 శాతం మెదడు క్యాన్సర్ కేసులను ప్రాథమిక క్యాన్సర్‌గా పరిగణిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమిక క్యాన్సర్ మెదడులోనే పుడుతుంది. 25 శాతం కేసులు సెకండరీ క్యాన్సర్ అని, దీనిలో క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాల నుండి మెదడుకు వ్యాపిస్తుందని వైద్యులు వివరించారు.

- Advertisement -

మెదడు క్యాన్సర్‌తో ఏ వ్యక్తులు ఎక్కువగా ప్రభావితమవుతారు?

- Advertisement -

ప్రైమరీ బ్రెయిన్ క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు. అయితే 15 ఏళ్లలోపు పిల్లలు, మధ్య వయస్కులు బ్రెయిన్ క్యాన్సర్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంది. అదే సమయంలో, వృద్ధులలో సెకండరీ బ్రెయిన్ ట్యూమర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాథమిక మెదడు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే చికిత్సను ప్రారంభించాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..

బ్రెయిన్ క్యాన్సర్‌లో సాధారణంగా కనిపించే లక్షణం తలనొప్పి అని, ఇది దాడికి కూడా దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెదడు క్యాన్సర్‌లో, రోగులు ఎక్కువగా ఉదయం తలనొప్పితో బాధపడుతుంటారు. తీవ్రమైన తలనొప్పి కారణంగా, నిద్రపోవడంలో కూడా సమస్య ఉంటుంది. ఎక్కువగా దగ్గు, తుమ్మడం వంటివి రావడం కారణంగా పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కణితి పెరుగుదల, తల ఎముకపై అధిక ఒత్తిడి కారణంగా తలనొప్పి వస్తుంది. ఇది కాకుండా ప్రవర్తనలో మార్పు, గందరగోళ స్థితిలో ఉండండం, మాట్లాడటం కష్టంగా ఉండడం, విషయాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బంది,
ఏకాగ్రతలో ఇబ్బందులు వంటివి మెదడు క్యాన్సర్ లక్షణాలు అని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News