BigTV English
Advertisement

paris olympics 2024 opening ceremony: పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ అదుర్స్, జట్టును లీడ్ చేసిన పీవీసింధు, శరత్

paris olympics 2024 opening ceremony: పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ అదుర్స్, జట్టును లీడ్ చేసిన  పీవీసింధు, శరత్

paris olympics 2024 opening ceremony: పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. చరిత్రక సెన్ నది ఓపెనింగ్ కార్యక్రమానికి వేదికైంది. దాదాపు ఆరు కిలోమీటర్ల పరేడ్‌లో 85 పడవలపై వేలాది మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. క్రీడాకారులు పడవల మీద విహరిస్తూ తన దేశ జెండాలతో అభిమానులకు అభివాదం చేస్తూ సాగిన తీరు మహా అద్బుతం.


నదికి ఇరువైపులా కళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలు కొనసాగాయి. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూసేందుకు దాదాపు మూడు లక్షల మంది హాజరయ్యారు. ఈ స్థాయిలో వేడులకను తిలకించడం ఓ రికార్డు. ఈ వేడుకులను ప్రత్యక్షంగా చూసేందుకు నది పరిసర ప్రాంతాల్లో దాదాపు 80 భారీ తెరలను ఏర్పాటు చేయడం విశేషం.

వర్చువల్‌కు వాస్తవానికి జత చేసిన ఈ వేడుకులను కొనసాగించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న పడవలో ముగ్గురు పిల్లలు, ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్ జ్యోతి తీసుకురావడంతో మొదలైంది. ఫ్రెంచ్ చరిత్ర, వారసత్వాన్ని, సంస్కృతిని చాటాడు. ఒక్కో విశిష్టమైన ప్రదేశానికి వెళ్లినప్పుడు ఆకట్టుకునేలా ప్రదర్శనలు అలరించాయి.


paris olympics 2024 opening ceremony
paris olympics 2024 opening ceremony

ఫ్యాషన్ ప్రపంచానికి కేరాఫ్ అయిన పారిస్‌లో, ప్రేమనగరి ప్రత్యేకతను తెలిపేలా ఆకాశంలో విమానాల పొగతో ఏర్పాటు చేసిన సన్నివేశాలు ఆహుతులను కట్టిపడేశాయి. పరేడ్ జరుగుతున్న సమయంలో పాప్ సింగ్ లేడీ గాగా తన ప్రదర్శనను చూపరులను ఆకట్టుకుంది. ఫ్రెంచ్ అక్షర క్రమంలో మిగతా దేశాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. 84వ దేశంగా భారత్ వచ్చింది.

paris olympics 2024 opening ceremony
paris olympics 2024 opening ceremony

భారత్ పరేడ్‌లో అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ జట్టుకు నేతృత్వం వహించారు. వీరిద్దరు జాతీయ జెండాను పట్టుకుని ముందు నిలబడగా వీరి వెనుకాల మన అథ్లెట్ల పడవ సాగింది.

paris olympics 2024 opening ceremony
paris olympics 2024 opening ceremony

ఇక సంప్రదాయ భారతీయ దుస్తుల్లో తెలుసు రంగుపై త్రివర్ణ పతాక వర్ణాలతో రూపొందించిన చీరలను మహిళలు, కుర్తా, పైజమాను పురుషులు ధరించారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు ఆటగాళ్లతోపాటు ప్రతినిధులు 78 మంది ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. మరికొందరు ఆటగాళ్లు పరేడ్‌కు హాజరుకాలేదు. మరికొందరు ఇంకా పారిస్ చేరుకోలేదు.

paris olympics 2024 opening ceremony pop singer hungama
paris olympics 2024 opening ceremony pop singer hungama

 

Related News

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Quinton de Kock : రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని, రీ-ఎంట్రీ ఇచ్చాడు…సెంచ‌రీతో పాకిస్తాన్ ను చిత్తు చేశాడు

Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

Big Stories

×