BigTV English
Advertisement

Jailed Ex Pak PM Imran Khan: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ పోటీ!

Jailed Ex Pak PM Imran Khan: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ పోటీ!

Imran Khan To Run For Oxford University Chancellor Post: వరల్డ్ ఫేమస్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయిన ఇమ్రాన్ ఖాన్..2005 నుంచి 2014 వరకు బ్రాడ్ పోర్డ్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు.


ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ఉన్న లార్డ్ ప్యాటెన్(80) రాజీనామా చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఈయన 21 ఏళ్లపాటు సర్వీసులో ఉన్నారు. అయితే ఈ ఛాన్సలర్ పదవి కోసం ఆన్‌లైన్ బ్యాలెట్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్..1972లో ఆక్స్‌ఫర్డ్‌లోని కేబుల్ కాలేజీలో ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ చదివాడు. ఆ తర్వాత బ్రాడ్ ఫోర్డ్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా పనిచేశారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి ఇమ్రాన్ ఖాన్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయర్, బోరిస్ జాన్సన్‌లు కూడా ఛాన్సలర్ పదవికి పోటీలో ఉన్నట్లు సమాచారం. అయితే గ్రాడ్యుయేట్స్ పూర్తి అకాడమిక్ దుస్తులతో హాజరుకావాలనే సంప్రదాయ ప్రక్రియకు బదులు ఆన్‌లైన్‌లో ఛాన్సలర్ ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.


Also Read: గాజాకు పోలియో ముప్పు.. వెల్లడించిన డబ్ల్యుహెచ్‌‌వో

ఇదిలా ఉండగా, పలు కేసుల్లో దోషిగా తేలడం, మరికొన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్.. ప్రస్తుతం రావల్సిండిలోని అదియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పదవికి ఇమ్రాన్ పోటీ చేయనున్నట్లు ఆయన అంతర్జాతీయ వ్యవహారాల సలహాదారు జుల్ఫీ బుఖారీ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఇమ్రాన్ నుంచి స్పష్టత వచ్చిన తర్వాత బహిరంగంగా ప్రకటిస్తామని తెలిపారు.పాక్ జైలులో ఉన్నప్పటికీ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఇమ్రాన్ తరఫు న్యాయవాది తెలిపారు.

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×