Big Stories

Back Pain: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? ఈ టిప్స్ ట్రై చేయండి

Back Pain: చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా ప్రస్తుతం ఎవరికి ఏ రోగాలు వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు. సాధారణంగా అందరికీ ఉండే నడుమునొప్పి సమస్య మాత్రం ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరిగిపోతుంది. ఎవరు చూసినా నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. తరచూ ల్యాప్ టాప్, కంప్యూటర్ల ముందు కూర్చుని వర్క్ చేసే సాఫ్ట్ వేర్ జాబర్స్ కు మాత్రం చిన్న వయసులోనే నడుము నొప్పి పీడించేస్తుంది. ఇక ఆటో డ్రైవర్లు, అన్ని రకాల వాహనాల డ్రైవర్లు సహా చాలా మంది గృహిణులు కూడా నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ నడుము నొప్పిని నివారించడానికి చాలా రకాల చిట్కాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

- Advertisement -

నడుమునొప్పి ఉన్న వారు. రోజు తమ అలవాట్లలో మార్పులు చేసుకోవాలట. వెన్నుముకను నిటారుగా ఉంచుకుని యోగా చేయాలట. ముఖ్యంగా పడుకునే సమయంలో నిటారుగా పడుకోవడం అలవాటు చేసుకోవాలట. మోకాళ్ల కింద దిండు పెట్టుకుని కాళ్లు ఎత్తుగా ఉండే విధంగా చూసుకుని నిద్రపోవడం వల్ల నడుమునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వ్యాయామం చేయడం వల్ల నడుము నొప్పిని జీవితంలోనే రాకుండా చేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
Back Pain
Back Pain

శరీరంలోని కండరాలను స్ట్రెచ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం వ్యాయామాలు చేయాలట. కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలట. పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నడుం నొప్పికి చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా సరైన చెప్పులను ఉపయోగించాలి. చెప్పుల కారణంగా కూడా నడుం నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక గంటల తరబడి కూర్చుని చేసే పనుల నుండి మధ్య మధ్యలో విరామం ఇస్తూ ఉండాలి. కాసేపు వాకింగ్ చేస్తూ వర్క్ చేసుకోవడం వల్ల నడుం నొప్పి సమస్యలను తగ్గించుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News