Big Stories

Chhattisgarh: ఎన్నికల వేళ.. నెత్తురోడుతున్న దండకారణ్యం..

Frequent Encounters In Chhattisgarh Ahead Of Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల వేళ దండకారణ్యం నెత్తురోడుతుంది. పచ్చని చెట్ల నడుమ సెలయేటి ధారలతో, పక్షుల కిలకిల రాగాలతో ప్రశాంతంగా ఉండే అటవీ ప్రాంతం తుపాకుల మోతలతో రాకెట్ లాంఛర్లతో, ల్యాండ్ మైన్ పేలుళ్లతో దద్ధరిల్లుతోంది. అసలు దండకారణ్యంలో ఏం జరుగుతోంది. సుక్మా, బస్తర్, బీజాపూర్, దంతెవాడ అటవీ ప్రాంతాలు నెత్తుటి ముద్ద కావడానికి కారణాలేంటి. అప్పుడో ఇప్పుడో జరిగే ఎన్‌కౌంటర్లు ఇప్పుడు ఎందుకు వరుసగా జరుగుతున్నాయి. అసలు ఆ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతోంది.

- Advertisement -

మంగళవారం ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. ముందుగా 18 మంది మరణించినట్లు వార్తుల వచ్చినా ఆ తరువాత 29 అని బస్తర్ రేంజ్ ఐజీ స్పష్టం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావో అగ్రనేతలు హతమయ్యారని సమాచారం. వరుస ఎన్‌కౌంటర్లతో ఛత్తీస్‌గఢ్ అట్టుడుకుతుంది.

- Advertisement -

అటు ఈ నెల 6వ తేదీన తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో భద్రతా బలగాలు-మావోయిస్టులకు కాల్పులు జరగడంతో ముగ్గురు హతమయ్యారు. అంతకుముందు ఏప్రిల్ 2న బీజాపూర్ జిల్లాలోని పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోలకు ఎదరుకాల్పులు జరగడంతో 8 మంది మావోలు హతమయ్యారు. గత నెల 27న బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురు మావోలు నేలకూలారు.

మార్చి 19న ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర బార్డర్.. గడ్చిరోలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు అగ్రనేతలు మరణించారు. ఇందులో డీవీసీ మెంబర్ వర్గీష్, మంగాతు, ప్లటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేశ్ హతమయ్యారు. ఫిబ్రవరి 27న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. అంతకుముందు సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావో్ హతమయ్యాడు. డిసెంబర్‌లో సుక్మా జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు నేలరాలారు.

గత 3 నెలల్లో దాదాపు 60 మంది మావోలను భద్రతా దళాలు ముట్టుబెట్టాయి. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం వివిధ చర్చలకు దారి తీస్తోంది. ఎన్నికల వేళ మాత్రమే మావోలు గుర్తొస్తారని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు మాత్రం కూంబింగ్‌లో భాగంగా వారు ఎదురుపడి కాల్పులు జరిపితే తమని తాము రక్షించుకోడానికి మాత్రమే కాల్పులు జరుపుతున్నామని చెబుతున్నారు. కాగా జనవరిలో భద్రతా బలగాల బేస్ క్యాంపులపై మావోయిస్టులు రాకెట్ లాంఛర్లతో విరుచుకుపడ్డారు. దీనికి ప్రతికార చర్యగానే మావోల ఏరివేత ప్రారంభమయ్యందని మాజీ నక్సలైట్లు, రిటైర్డ్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. అటు బస్తర్ రేంజ్ ఐజీ మాత్రం మావోల ఏరివేతే లక్ష్యమని అంటున్నారు.

3 నెలల్లో 60 మంది మావోలను కోల్పోవడం వారికి కోలుకోలేని దెబ్బే. కానీ ఇద్దరి మధ్య నష్టపోయేదీ.. నలిగిపోయేది మాత్రం అడవి బిడ్డలే. అడవి బిడ్డలు కాల్పుల మోతలతో నిత్యం ప్రాణాలు అరచేతిన పెట్టుకుని జీవిస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయంతో బ్రతుకుతున్నారు. అటు ఇన్ఫార్మర్లంటూ.. ఇటు మిలిటెంట్లు అంటూ ఎప్పుడు ఏం జరుగుతుందో దిక్కుతోచని పరిస్థితి. సరిగ్గా ఎన్నికల ముందే ఇలాంటి ఎన్‌కౌంటర్‌లు జరగడమేంటని ప్రశ్నిస్తున్నారు.

కాగా ఛత్తీస్‌గఢ్‌లో ఒక్క నియోజకవర్గానికి ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఇక రెండో దశలో 3 నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న, మూడో దశలో 7 నియోజకవర్గాలకు మే 7న ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News