BigTV English

Sri Rama Navami Live Telecast: భక్తులకు శుభవార్త.. రాములోరి కళ్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్..

Sri Rama Navami Live Telecast: భక్తులకు శుభవార్త.. రాములోరి కళ్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్..

Sri Rama Navami Live Telecast: భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రతి ఏడాది కన్నుల పండువగా వైభవంగా జరిగే ఈ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ముందుగా ఈసీ అనుమతి నిరాకరించింది.


భద్రాద్రి క్షేత్ర ప్రాముఖ్యత, కళ్యాణ వేడుక వైభవాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ రామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. కాగా ఈ అభ్యర్థనను ఏప్రిల్ 4వ తేదీన ఎన్నికల కమిషన్ తిరస్కరించింది.

దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేసింది. తమ ప్రభుత్వ అభ్యర్థనను పునఃపరిశీలించాలని ఏప్రిల్ 6వ తేదీన లేఖ రాసింది. నేరుగా వైకుంఠం నుంచి వచ్చి కొలువు దీరిన చతుర్భుజ రామునిగా దక్షిణ భారతదేశంలో అపూర్వమైనదిగా కొలిచే భద్రాద్రి రాముని వేడుకలు అత్యంత ప్రాధాన్యమైనవని ఈసీకి విజ్ఞప్తి చేసింది.


దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని కోరింది.

1987 నుంచి ప్రత్యక్ష ప్రసారం ఆనవాయితీగా వస్తోందని, 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ లైవ్ ఇచ్చిందని, రేడియో ద్వారా కళ్యాణ మహోత్సవ వ్యాఖ్యానం ప్రసారమైందని ప్రభుత్వం ప్రస్తావించింది.

ఈ నేపథ్యంలో కోట్లాది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో మంగళవారం సాయంత్రం ఈసీ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతిచ్చింది.

 

Tags

Related News

Gold ganesh idol: ఒకే అంగుళంలో అద్భుతం.. మెరిసే బంగారు వినాయకుడు.. మీరు చూశారా?

Hanuman darshan: భక్తుల మనసు దోచుకుంటున్న హనుమంతుడు.. లైఫ్ లో ఒక్కసారైనా చూసేయండి!

Ganesh Chaturthi Song: “వక్రతుండ మహాకాయా”.. ఏళ్లు గడిచినా దైవత్వాన్ని నింపుతూ!

Ganesh Chaturthi 2025: పండగ రోజు వినాయకుడిని ఈ సమయంలో పూజిస్తే.. అంతా శుభమే !

Lord Ganesha: మనిషి రూపంలో దర్శనం ఇచ్చే గణపతి – ఆలయ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు

Ganesh Chaturthi 2025: వినాయక చవితి రోజు.. ఎలాంటి ప్రసాదాలు దేవుడికి సమర్పించాలి ?

Big Stories

×