Big Stories

Water Bottle Cleaning : నీళ్ల సీసా వాసనొస్తుందా? ఇలా క్లీన్ చేయండి..

Water Bottle Cleaning

Water Bottle Cleaning : ఇంట్లో అయినా ఆఫీసులో అయినా మనం రోజూ వాడే స్టీల్ వాటర్ బాటిళ్లు కొన్ని రోజులకి దుర్వాసన వస్తుంటాయి. నీళ్లు తాగేటప్పుడే నోటి దగ్గర పెడితే అదే వాసన తగులుతుంది. దీంతో ఇబ్బందిగా ఫీలవుతాము. అయితే.. వీటిని కొన్ని చిట్కాల ద్వారా శుభ్రం చేసుకోవచ్చు. అదెలాగంటే..?

  • టీ డికాక్షన్‌ కాచి.. దాన్ని బాటిల్లో వేసి, మూతపెట్టి బాగా షేక్‌ చేయాలి. చివరగా బ్రష్‌తో లోపల, మూతపెట్టే అంచుల దగ్గర రుద్దితే వాసనలు పోతాయి.
  • అర చెక్క నిమ్మరసాన్ని సీసాలో పిండి, తగినన్ని నీళ్లు పోసి బాగా కదపాలి. లేదంటే బాటిల్‌లో వేడినీళ్లు, కొన్ని నిమ్మతొక్కలు వేసి కదిపితే దుర్వాసన పోతుంది.
  • టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడాను సీసాలో వేసి నిండా నీటిని నింపాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లు వంపేసి బాటిల్‌ శుభ్రం చేస్తే సరి.
  • చిన్నపిల్లలు మంచినీళ్లు నోటికి దగ్గరగా ఉంచి తాగుతారు. అందుకే వాళ్ల సీసాని రోజూ శుభ్రం చేయాల్సిందే.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News