Big Stories

Hash Oil: ఫిలింనగర్ పరిధిలో హాష్ ఆయిల్ విక్రయం.. ముఠా అరెస్ట్

Share this post with your friends

Hash Oil: హైదరాబాద్ లోని ఫిలింనగర్ పరిధిలో హాష్ ఆయిల్, చరస్ ను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితుల నుంచి 310 మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్, 70 గ్రాముల చరస్, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు హాష్ ఆయిల్ ను అరకు నుంచి తక్కువ ధరకే తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న హాష్ ఆయిల్ విలువ రూ.2.28 లక్షలు ఉంటుందని వెల్లడించారు. సొత్తు సహా నిందితులను ఫిలింనగర్ పోలీసులకు అప్పగించారు. మత్తుపదార్థాలు, హాష్ ఆయిల్ వంటి విక్రయాలు జరగకుండా పోలీసులు, అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా అడపా దడపా ఇలాంటి కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దేశ విదేశాల నుంచి మత్తుపదార్థాల స్మగ్లింగ్ కు కూడా స్మగ్లర్లు పోలీసులకు దొరకకుండా రకరకాల దారులను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువతే టార్గెట్ గా మత్తుపదార్థాల విక్రయాలు జరుగుతుండటంతో.. తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు గతంలో పలుమార్లు సూచించారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News