Big Stories

Mangoes : మామిడిపండ్లు తినేముందు ఇలా చేస్తే.. ఆ సమస్యలు రావంట..

- Advertisement -

Mangoes Precautions : వేసవి అంటే మామిడిపండ్లు.. మామిడిపండ్లంటే వేసవి కాలం. వేసవికాలంలో అసలే వేడి ఎక్కువ. మామిడి పండ్లు కూడా అతిగా తింటే వేడి చేస్తుంది. ఇందుకు కారణంలో ఫైటిక్ యాసిడ్. కానీ.. ఈ సీజన్ లో మాత్రమే వచ్చే పండ్లు కాబట్టి.. వీటిని తినేందుకు మ్యాంగో లవర్స్ ఎదురుచూస్తుంటారు. పండ్ల రారాజు మామిడిపండు. మామిడిలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

- Advertisement -

ఇంతకీ ఎందుకిప్పుడు మామిడిపండ్ల గురించి చెప్పుకుంటున్నామంటే.. వాటిని ఎలాపడితే అలా తింటే ఆరోగ్యానికి హానికరం. మామిడిపండ్లు తినడానికి ఒక అరగంట సేపు నీటిలో నానబెట్టాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు.

Also Read : ప్లాస్టిక్ బాక్సుల్లో వేడి ఆహారం తీసుకెళ్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా?

మామిడి పండ్ల నుంచి ఫైటిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. వీటిని నీటిలో నానబెట్టినపుడు వాటి నుంచి అదనంగా ఉత్పత్తయ్యే ఫైటిక్ యాసిడ్ తొలగుతుంది. శరీరంలో వేడి పెరగకుండా ఉంటుంది. నీటిలో నానబెట్టకుండా తిన్నారో.. వేడి చేసి వాంతులు, విరేచనాలు కావొచ్చు.

ఫ్రిడ్జ్ లో నిల్వచేసిన మ్యాంగోలను కూడా తినడానికి అరగంట ముందు నీటిలో నానబెడితే..దాని రుచి పెరుగుతుంది. రక్తహీనత రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. షుగర్ ఉన్నవారు మాత్రం మామిడి పండ్లకు దూరంగా ఉండాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News