Big Stories

Plastic Box: ప్లాస్టిక్ బాక్సుల్లో వేడి ఆహారం తీసుకెళ్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా?

Plastic Box
Plastic Box

Plastic Box: మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా జనాలు ఏ పని చేసినా ఉరుకులు, పరుగులు మీదే చేస్తున్నారు. కనీసం వారు తమ కోసం తీసుకునే ఆహారాన్ని కూడా ఏ విధంగా తీసుకోవాలో ఆలోచించడం లేదు. ముఖ్యంగా సిటీ లైఫ్ లీడ్ చేసే భార్యభర్తలైతే కనీసం వారికి కూర్చుని కాసేపు మాట్లాడుకునే తీరిక కూడా దొరకదు. వారి వారి పనులకు వెళ్లేందుకు టైంతో పోటీ పడుతుంటారు. ఈ తరుణంలో కొంత మంది మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా వెళ్తుంటారు. దీంతో వేడివేడిగా ఉండే ఫుడ్‌ని బాక్సుల్లో పెట్టి తీసుకెళ్తుంటారు. ఇలా వేడి వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టుకుని వెళ్లడం మంచిది కాదట. ఎక్కువ సేపు వేడిగా ఉండే ఆహారం ప్లాస్టిక్ బాక్సుల్లో ఉంచి తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంతో మంది శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ ప్లాస్టిక్ వాడకాన్ని మాత్రం తగ్గించడం లేదు. మార్కెట్లలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాలు కనిపిస్తూనే ఉంటాయి. అమ్మకాలు జరిగినా కొనుగోలుచేసే వారు మాత్రం తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేసి.. అందులో వేడి ఆహారాన్ని తీసుకెళ్లి తింటుంటారు. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ లో ఉండే హానికరమైన రసాయనాలు ఆహారంతో పాటు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

- Advertisement -

Also Read: టైం అవుతుందని గబగబా తినేస్తున్నారా ?.. అయితే మీరు అనారోగ్యం బారిన పడినట్లే

ప్లాస్టిక్ కారణంగా వ్యాధులకు గురికావాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లలకు పెట్టే ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టడం మూలంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రసాయనాలు పిల్లల ఎదుగుదలను దెబ్బ తీసి, అనేక సమస్యలకు గురిచేసే అవకాశం ఉంటుంది.

ప్లాస్టిక్ వస్తువుల్లో తీసుకెళ్లిన ఆహారాన్ని తినడం వల్ల హార్మోన్ల సమస్యలు తలెత్తుతాయి. మధుమేహం, థైరాయిడ్, అలెర్జీ, బ్యాక్టీరియా, వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్ లేదా గాజు వంటి బాక్సుల్లో ఆహారాన్ని తీసుకెళ్లడం మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News