Big Stories

Corporation Chairman | రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 54 కార్పొరేషన్ల ఛైర్మన్‌ల నియామకాలు రద్దు

Corporation Chairman | తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిఆర్ఎస్ హయంలో కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా నామినేటెడ్ పద్ధతిలో నియమితులైన వారందరి నియామకాలు రద్దు చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఈ ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్లు, వైస్ చైర్మన్ల కార్యాలయాల్లో పీఏ, పీఎస్, ఓఎస్డీలుగా సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వారి సొంత డిపార్టుమెంట్లలోకి వెళ్ళిపోవాలని ఈ ఆదేశాల్లో పేర్కోన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈ ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. ఇప్పటికే కొంత మంది రాజీనామా చేయగా.. మరికొందరు ఇంకా ఉద్యోగం కొనసాగుతున్నారు. ఇప్పుడిక వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించారు.

- Advertisement -

టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాసయాదవ్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, వికలాంగుల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కల్లుగీత సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ రజని, గొర్రెల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఇలా మొత్తం 54 మంది పదవులు రద్దయ్యాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News