Big Stories

BJP: పాలమూరు నుంచి మోదీ పోటీ!.. ఏది రియల్? ఏది వైరల్?

BJP: రాజకీయ వ్యూహాలు ఓ పట్టాన అర్థం కావు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేది నిజమే. అంతకుముందు ఎవరైనా అనుకున్నారా.. రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తారని? వయనాడ్ ఎంపీ అవుతారని? అమేథిలో ఆయనపై స్మృతి ఇరానీ గెలుపు సైతం అనూహ్యం. అందుకే అంటారు రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని.

- Advertisement -

మోదీ ఈసారి పాలమూరు నుంచి పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలు అలాంటివే. ప్రముఖ డిజిటల్ పత్రికలో ఆ మేరకు ఓ కథనం రావడంతో ఆ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం.. మోడీ మహబూబ్ నగర్ నుంచి పోటీ అనే వార్త ఉన్న పేపర్ క్లిపింగ్ ను షేర్ చేయడం.. ఇక కాస్కోండి అంటూ కామెంట్ చేయడంతో.. తెలంగాణలో చర్చ మొదలైంది. ఇంతకీ మోదీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తారా? ఆ న్యూస్ లో నిజమెంత?

- Advertisement -

కమలనాథులు చాలాకాలంగా దక్షిణాదిపై గురి పెట్టారు. అయితే, సౌత్ లో ప్రాంతీయ పార్టీలు బీజేపీకంటే బలంగా ఉండటంతో.. పలు రాష్ట్రాల్లో పట్టు చిక్కట్లేదు. కర్నాటకను మాత్రం కొల్లగొట్టారు. ఇక, నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే. అందుకే, ఈసారి తెలంగాణపైనే బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టిందనేది వాస్తవం.

అయితే, తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తున్నంత మాత్రాన.. స్వయంగా మోదీనే ఇక్కడి నుంచి బరిలో నిలుస్తారా? పాలమూరులో కమలం పార్టీకి అంత బలముందా? అనేది కీలకాంశం. మోదీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తే.. ఆ ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది. దక్షిణాది మీద కూడా ప్రభావం చూపుతుంది. అందులో నో డౌట్. మరి, పాలమూరు బరి నుంచి పోటీ చేసేంత సీన్ ఉందా?

గుజరాతీగా మోదీకి దేశవ్యాప్త ఇమేజ్ ఉంది. తాను గుజరాతీనని ఆయన గర్వంగా చెప్పుకుంటారు. గుజరాత్ తో నరేంద్రునికి విడదీయరాని అనుబంధం. అలాంటి మోదీ సొంతరాష్ట్రాన్ని వీడి తెలంగాణకు వస్తారా?

రాహుల్ గాంధీ యూపీ నుంచి వయనాడ్ కు షిఫ్ట్ అవలేదా? అంటే రాహుల్ తో మోదీని పోల్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీకి అమేథిలో కాంగ్రెస్ పరిస్థితి బాగా లేదని ముందే తెలుసు. అందుకే, సేఫ్ సైడ్ అమేథితో పాటు వయనాడ్ లోనూ బరిలో దిగారు. యూపీలో ఓడి, కేరళలో గెలిచి పరువు నిలుపుకున్నారు.

మోదీ విషయం అలాకాదు. గుజరాత్ లో ఏ మూల నుంచి పోటీ చేసినా.. ఆయనకు తిరుగులేని మెజార్టీ ఖాయం. మరి, పాలమూరులో మోదీ తప్పకుండా గెలుస్తారా? అంటే ధీమాగా చెప్పలేని పరిస్థితి. మరి, మోదీ అంత రిస్క్ ఎందుకు చేస్తారు? గుజరాత్ ను ఎందుకు వీడతారు?

కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తుంటారు. వ్యూస్ కోసం కొందరు.. ఫేక్ పబ్లిసిటీ కోసం మరికొందరు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వాగేస్తుంటారు. అందులో నిజానిజాలెంతో ఎవరికీ తెలీదు. ఈ న్యూస్ వచ్చింది కూడా కాంగ్రెస్ ఫ్లేవర్ ఉన్న మీడియాలో కావడంతో.. ఇదంతా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రచారమని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తప్పించి ఆయన స్థానంలో ఈటల రాజేందర్ ను నియమిస్తారంటూ కూడా అదే మీడియాలో వార్త వచ్చింది. ఇదంతా పక్కా ప్లాన్డ్ గా జరుగుతోందని మండిపడుతున్నారు కమలనాథులు. ఎలా చూసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మోదీ పాలమూరు నుంచి పోటీ చేసే ఛాన్సెస్ తక్కువే అని విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News