BigTV English

Niti Aayog Council Meeting: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం..

Niti Aayog Council Meeting: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం..

NITI Aayog Council Meeting updates(Telugu news live): ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన ఆరుగురు సీఎంలు బహిష్కరించారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరింగందంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.


వీరిలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి , కర్నాటక సీఎం సిద్ధరామయ్య ,హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖీవందర్‌ సింగ్‌ సుఖూ తో పాటు తమిళనాడు సీఎ ఎంకే స్టాలిన్‌ , కేరళ సీఎం విజయన్‌, పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌ ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వమూ భేటీని బాయ్‌కాట్‌ చేసింది.

రాష్ట్ర హక్కులను దెబ్బతీయడం, నిధులు విడుదల చేయకపోవడం వంటి వాటికి నిరసనగా ఇవాళ జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకావటం లేదు. కేంద్ర బడ్జెట్ లో చూపిన వివక్షకు వ్యతిరేకంగా తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానని రేవంత్ రెడ్డి శాసన సభలోనే ప్రకటించారు. కేంద్రం తెలంగాణపై కక్ష కట్టిందని.. నిధులు కేటాయింపుపై తీవ్ర వివక్ష చూపారంటూ తొలి నిరసనగా నీతి ఆయోగ్‌ భేటీని బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని ఆరోపించారు సీఎం రేవంత్‌.


Also Read: పంద్రాగస్టు తర్వాత పాలన పరిగెత్తిస్తారా రేవంత్ రెడ్డి?

మొత్తంగా.. తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నీతి ఆయోగ్‌ భేటీకి హాజరవుతుండగా.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం బాయ్‌కాట్‌ చేస్తున్నారు. అయితే.. కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలతో ఏకంగా ఆరు రాష్ట్రాల సీఎంలు.. నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను బాయ్‌కాట్‌ చేస్తుండడం చర్చనీయాంశం అవుతోంది.

2047 ఏడాదికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరుకానున్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×