E-Paper
Advertisement

Law student raped: స్నేహితురాలిపై భర్త అత్యాచారం, సహకరించిన భార్య.. తిరుపతిలో దారుణం

Law student raped: స్నేహితురాలిపై భర్త అత్యాచారం, సహకరించిన భార్య.. తిరుపతిలో దారుణం
Advertisement

Law student raped in Tirupati(Andhra news today): గంజాయి పేరు చెప్పగానే ఏపీ పేరు గుర్తుకొచ్చేది. ప్రభుత్వం మారగానే దానిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయ్ మత్తులో జరుగుతున్న అన్యాయాలు అన్నీఇన్నీకావు. న్యాయ విద్యలో ఉన్నత‌స్థాయి వెళ్లాల్సిన ఆ దంపతులు గాడి తప్పారు. అంతేకాదు లా స్టూడెంట్‌ని గంజాయి మత్తులోకి దించారు. తోటి ఫ్రెండ్ తన భర్తతో అమ్మాయిపై అత్యాచారం చేయించిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది.

కర్నూలు జిల్లాకి చెందిన 22 ఏళ్ల యువతి తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ చేరింది. కొద్ది రోజులు వసతి గృహంలో ఉండేది. ఆ సమయంలో తిరుపతి రూరల్ మండలానికి చెందిన సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణతో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు సదాశివం ఇంటికి వెళ్లేది ఆ విద్యార్ధిణి. ఈక్రమంలో ప్రణవకృష్ణ తన భర్త కిషోర్‌రెడ్డిని పరిచయం చేసింది.

Advertisement

కిషోర్‌రెడ్డి కూడా ఎస్వీయూలో ఎల్ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ప్రణవకృష్ణ దంపతులు గంజాయికి అలవాటుపడ్డారు. అప్పుడప్పుడు ఇంటిని వచ్చిన మరో న్యాయ విద్యార్థిణికి అలవాటు చేశారు. యువతి మత్తు మైకంలో ఉన్నప్పుడు కిషోర్‌రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అందుకు సంబంధించిన దృశ్యాలను అతని భార్య సెల్‌ఫోన్‌లో షూట్ చేసింది.

ఆ తర్వాత ఈ దంపతులిద్దరు ఆ సన్నివేశాలను చూపించి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. బాధిత యువతి నుంచి ఐదు లక్షలు తీసుకున్నారు. చివరకు దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు, బాధిత యువతి సోదరుడు, కాబోయే భర్తకు పంపి భారీ మొత్తంలో డిమాండ్ చేశారు.

Advertisement

ALSO READ: డైవోర్స్ అప్లై చేసిందని, కూతురు కాళ్లు నరికిన తండ్రి

ఈ వ్యవహారంపై యువతి కుటుంబసభ్యులు రెండురోజుల కిందట తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు, శుక్రవారం ప్రణవకృష్ణ తన భర్త కిషోర్‌రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దర్నీ ఆ యూనివర్సిటీ నుంచి తొలగించారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×