BigTV English

Kantara Chapter 1: చివరి దశకు ‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్‌.. ఈసారి మరింత ఉత్కంఠగా..!

Kantara Chapter 1: చివరి దశకు ‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్‌.. ఈసారి మరింత ఉత్కంఠగా..!

Rishab Shetty Kantara Chapter 1 Update(Cinema news in telugu): ప్రముఖ కన్నడ స్టార్ హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార’ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. ఒక చిన్న సినిమాగా వచ్చి యావత్ సినీ ప్రపంచ ప్రియుల్ని కట్టిపడేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ చిత్రానికి నీరాజనాలు పలికారు. దీంతో వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.411.08 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 2022 బ్లాక్‌బస్టర్ మూవీగా ‘కాంతారా’ నిలిచింది. ఈ మూవీ రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ దీనికి సంబంధించిన వీడియోలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.


రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో పౌరాణిక, యాక్షన్, స్థానిక సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకర్షించింది. దీంతో ‘కాంతార’ మూవీ ఇటీవలి కాలంలో అత్యంత విజయవంతమైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దీనికి ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ చిత్రం అత్యంత గ్రాండ్ లెవెల్లో షూటింగ్ జరుపుకుంటుంది.

Also Read: పెద్ద రిస్కే చేస్తున్న కాంతారా దర్శకుడు రిశబ్ శెట్టి..!


‘కాంతార చాప్టర్ 1’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ గతేడాది 2023లో స్టార్ట్ అయింది. ఈ చిత్రం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇక అన్ని పనులు కంప్లీట్ చేసి 2025 వేసవిలో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి ప్రకారం.. ‘కాంతార చాప్టర్ 1’ ఇండోర్ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇంకా 15 నుండి 20 రోజుల వర్క్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం.

ఈ 20 రోజుల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి పోస్ట్-ప్రొడక్షన్ ప్రక్రియ, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఇప్పటికే పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి. కాగా ఈ ప్రీక్వెల్ మూవీ ‘కాంతార’ కంటే మరింత ఉత్కంఠగా ఉంటుందని అంటున్నారు. సెకండ్ పార్ట్ కంటే ఈ ఫస్ట్ పార్ట్ ఎవరూ ఊహించని విధంగా.. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రాబోతున్నట్లు సమాచారం. సెకండ్ పార్ట్‌ కంటే ఈ ప్రీక్వెల్‌ కోసం నిర్మాతలు ఎక్కువ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అందువల్లనే పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో టీమ్ రాజీ పడడం లేదని సమాచారం. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించినట్లు తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×