BigTV English

woman’s father chops her legs: డైవోర్స్ అప్లై చేసిందని, కూతురు కాళ్లు నరికిన తండ్రి

woman’s father chops her legs: డైవోర్స్ అప్లై చేసిందని, కూతురు కాళ్లు నరికిన తండ్రి

woman’s father chops her legs: పరువు హత్యలు గురించి అప్పుడప్పుడు వింటుంటాం. కుటుంబం పరువు తీసిందని కూతుర్ని కడతేర్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. డైవోర్స్‌కు అప్లై చేసిందని కూతురు కాళ్లు నరికేశాడు కన్న తండ్రి. సంచలనం రేపిన ఈ ఘటనలో పాకిస్థాన్‌లో వెలుగుచూసింది.


పాకిస్థాన్‌లోని గాల్ పట్టణం. ఈ ప్రాంతానికి చెందిన సోబియా బతూల్ షాకి మ్యారేజ్ అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరు చిన్నవాళ్లు.. అందంగా ఉంటారు. కాకపోతే సోబియాను ఆమె భర్త ఏనాడు పట్టించుకోలేదు. ఏదైనా అడిగితే చిటికీ మాటికీ కొట్టేవాడు. హింసించేవాడు.. సింపుల్ చెప్పాలంటే క్రూరంగా వ్యవహరించేవాడు. వీడి టార్చర్ రోజురోజుకూ శృతి మించడంతో తట్టుకోలేకపోయింది.

ఇలాంటి కసాయితో కాపురం చేసే బదులు దూరంగా ఉండడమే బెటరని అంచనాకు వచ్చింది సోబియా. ఈ క్రమంలో విడాకులకు అప్లై చేసింది. నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం, నలుగురు మధ్యకు వచ్చింది. కూతురు విడాకుల వ్యవహారం ఆమె తండ్రి సయ్యద్ ముస్తఫా షాకి తెలిసింది.


సోబియా మామ సయ్యద్ ఖుర్బానీ షా ఒకటి రెండు మాటలు చెప్పి వియ్యంకుడి మనసును కాకావికలం చేశాడు. పట్టరాని కోపంతో తండ్రి, మామలిద్దరు కలిసి సోబియా కాళ్లను నరికేశారు. అక్కడి నుంచి పరారయ్యారు. సోబియా గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు వచ్చి సోబియాను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: తిరుపతిలో దారుణం, గంజాయి మత్తు.. లా స్టూడెంట్‌పై అత్యాచారం

ఆ తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి జరిగిన తతంగాన్ని విడమరిచి చెప్పింది. తన మొర వినేవాళ్లు లేక చివరకు విడాకులకు అప్లై చేసుకున్నానని, ఆ పని చేయడమే తాను చేసిన నేరమని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు, వారి కోసం గాలింపు చేపట్టారు.

 

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×