BigTV English

SSMB29 Latest Update: ‘బంగారం’ లాంటి టైటిల్‌తో పాటు ఇన్ని అప్డేట్‌లా.. ఫ్యాన్స్‌కు పూనకాలే..!

SSMB29 Latest Update: ‘బంగారం’ లాంటి టైటిల్‌తో పాటు ఇన్ని అప్డేట్‌లా.. ఫ్యాన్స్‌కు పూనకాలే..!

SSMB29 Latest Update: ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో పలు పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. మరికొన్ని తెరకెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి కోసం యావత్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘SSMB29’. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత అతడు తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అదీగాక ఒక టాలీవుడ్ సూపర్ స్టార్‌తో సినిమా తీస్తుండటంతో అటు దర్శకుని ఫ్యాన్స్, ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఓ స్థాయిలో ఉంది.


ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి చాలా గ్రాండ్‌ లెవెల్లో తెరకెక్కించాలని చూస్తున్నాడట. అందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు అవుతున్నా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. దీనిబట్టి చూస్తే రాజమౌళి ఏ రేంజ్‌లో అన్ని పనులను సెట్ చేసుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌ మీదకు వెళుతుందా? అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

వారి ఉత్కంఠ కారణంగానే సినిమాకి సంబంధించి ఎలాంటి వార్త బయటకొచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇందులో భాగంగానే తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాన్ వరల్డ్ ఫ్రాంచైజీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ఓ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రెజర్ హంట్ నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుందని తెలుస్తోంది. అందువల్లనే ఈ సినిమాకి ‘గోల్డ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ అయితేనే చాలా బాగుంటుందని భావిస్తున్నారట.


Also Read: మహేష్ కు విలన్ గా సలార్ విలన్.. కన్ఫర్మ్.. ?

అంతేకాకుండా ‘గోల్డ్’ అనేది యూనివర్సల్ టైటిల్ కాబట్టి ఇదే కరెక్ట్ అని రాజమౌళి కూడా భావిస్తున్నాడని తెలుస్తోంది. దీంతో ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అంతా ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ టైటిల్ చాలా చక్కగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేశ్ బాబు రెండు డిఫరెంట్ పాత్రలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ పాత్ర హనుమంతుడి లక్షణాలతో ఉంటుందని సమాచారం.

ఈ అప్డేట్స్ కాకుండా మరికొన్ని కూడా బయటకొచ్చాయి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ముందే దీనికి సంబంధించిన ఓ చిన్న గ్లింప్‌ను రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. అంతేకాకుండా అదేరోజు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని అంటున్నారు. కాగా ఇందులో విలన్ రోల్ కోసం కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×