BigTV English

Jasprit Bumrah: వారు ముగ్గురూ నాకు గురువులే: బుమ్రా

Jasprit Bumrah: వారు ముగ్గురూ నాకు గురువులే: బుమ్రా

Bumrah latest news(Cricket news today telugu): ఎప్పుడూ మౌనంగా ఉండే టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలు పలు అంశాలపై స్పందించాడు. నిరభ్యంతరంగా తన మనసులో మాటలు తెలిపాడు. అన్నింటికన్నా ముఖ్యంగా తను చెప్పిన అంశం ఏమిటంటే, తనకి ఇండియన్ క్రికెట్ లో ముగ్గురు గురువులున్నారని అన్నాడు.


మొదట తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కొహ్లీ అని అన్నాడు. తను కెప్టెన్ కాకపోయినా, ఎప్పటికీ నాయకుడేనని తెలిపాడు. అన్నిటికి మించి తను ఫిట్ నెస్ కాపాడుకునే విధానం అత్యద్భుతమని తెలిపాడు. మేమందరం తన నుంచి ఫిట్ నెస్ విషయంలో స్ఫూర్తి పొందుతుంటామని తెలిపాడు.

ఇక తన జీవిత లక్ష్యం ఏమిటంటే విరాట్ కొహ్లీ వికెట్ తీయడమని అన్నాడు. అది ఐపీఎల్ లో నెరవేరిందని తెలిపాడు. అంతేకాదు ఐపీఎల్ లో తన మొదటి మ్యాచ్ లో మొదటి వికెట్ కూడా కొహ్లీదేనని తెలిపాడు. ఇది నాజీవితంలో మరిచిపోలేని క్షణమని అన్నాడు.


తర్వాత మరొక గురువు ఎవరంటే.. తనకెంతో ఆత్మీయుడైన కెప్టెన్ రోహిత్ శర్మని తెలిపాడు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, తనవల్లనే అని అన్నాడు. నాకు మార్గదర్శకుడు రోహిత్ అని తెలిపాడు. నా బౌలింగుని, నా ప్రతిభని గుర్తించి, నన్నింతవాడ్ని చేసింది తనేనని తెలిపాడు. నేను ఫలానా బాల్ వేస్తానని రోహిత్ కి చెబుతాను. అందుకు తగినట్టుగా రోహిత్ ఫీల్డింగ్ సెట్ చేస్తాడు. అది తనిష్టమని తెలిపాడు. అలా మా ఇద్దరి కాంబినేషన్ సక్సెస్ అయిందని తెలిపాడు.

అన్నింటికన్నా ముఖ్యమైనది రోహిత్ లో గొప్ప గుణం ఏమిటంటే, జట్టులో అందరూ చెప్పింది శ్రద్ధగా వింటాడు. అందులో తనకి నచ్చింది తీసుకుంటాడు. లేదంటే వీటన్నింటిని కలిపి, ఏదొక ప్లాన్ చేసి అమలు చేస్తాడు. ఇంకది తనిష్టమని తెలిపాడు. కాకపోతే వాతావరణాన్ని తేలిక చేస్తూ జోక్స్ కట్ చేస్తుంటాడు. అది డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితమని నవ్వుతూ అన్నాడు.

Also Read: ఒలింపిక్స్ లో.. ఫ్లాగ్ బేరర్స్‌గా సింధు, శరత్ కమల్

ఇక చివరిగా చెప్పాలంటే ఆఖరి గురువు మహేంద్ర సింగ్ ధోనీ అని తెలిపాడు. తన హయాంలోనే నేను ఇండియన్ క్రికెట్ లో అడుగుపెట్టానని తెలిపాడు. ఇలా హేమాహేమీలైన ముగ్గురు క్రికెటర్ల సహచర్యంలో తన బౌలింగు ఎంతో మెరుగుపడిందని తెలిపాడు. అయితే మరోవైపు నుంచి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ గా బుమ్రా పేరెందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరి ఒకప్పుడు బౌలర్ కపిల్ దేవ్ కదా…తొలిసారి ఇండియాకి వన్డే ప్రపంచకప్ ను తీసుకొచ్చిందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి  బుమ్రా అంశం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Big Stories

×