Big Stories

New Parliament: పార్లమెంట్ 2.0.. ప్రత్యేకతలెన్నో..

New Parliament

New Parliament: కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో చాలా కొత్త ఫీచర్స్ వచ్చి చేరాయి. ఇప్పటి అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని అహ్మదాబాద్‌ కు చెందిన హెచ్‌సీపీ డిజైనర్‌ బిమల్ హస్ముఖ్ పటేల్ డిజైన్‌ చేశారు. అత్యాధునిక వసతులు, ఎకో ఫ్రెండ్లీ ఫీచర్స్ కొత్త బిల్డింగ్ లో కనిపిస్తాయి. పాత పార్లమెంట్ భవనంలో ఫైర్ సేఫ్టీ ఫీచర్స్ అంతగా లేవు. అయితే కొత్త బిల్డింగ్ లో మాత్రం పకడ్బందీ ఏర్పాట్లున్నాయి.

- Advertisement -

స్వాతంత్ర్యం వచ్చాక నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ఇది. ఇప్పుడున్నది స్వాతంత్ర్యం రాకముందు కట్టింది. కొత్త బిల్డింగ్ ను పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో కట్టించారు. ఈ భవనంలో ఇన్ స్టాల్ చేసిన ఎలక్ట్రానిక్ డివైజెస్ 30 శాతం పవర్ ను ఆదా చేస్తాయి. వర్షపునీటి మేనేజ్ మెంట్ అలాగే సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. కొత్త పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తే, HCP డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డిజైన్ అందించింది.

- Advertisement -

కొత్త పార్లమెంట్ ను పబ్లిక్ పార్లమెంట్ హౌజ్ గా చెబుతున్నారు. ఇందులో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు వచ్చేలా రెండు స్పెషల్ ఎంట్రీ పాయింట్లు పెట్టారు. వారు నేరుగా పబ్లిక్ గ్యాలరీ, సెంట్రల్ కాన్ స్టిట్యూషనల్ గ్యాలరీకి చేరుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఉంది. ఈ క్రమంలో ఎన్నో చారిత్రక సంఘటనలకు నిలయంగా మారింది. ఉగ్రవాదుల దాడులకూ గురైంది. ఇప్పుడు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అందుబాటులోకి వస్తుండడంతో పాత భవనాన్ని ఏం చేస్తారనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉన్న పాత పార్లమెంట్ భవనాన్ని బ్రిటిషర్లు నిర్మించారు. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లూటెన్స్ హర్ బర్ట్ బేకర్ ఈ భవనానికి డిజైన్ చేశారు. దీన్ని నిర్మించేందుకు ఆరేళ్లు టైం పట్టింది. ఈ భవనం 1927లో నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే అందరికీ సరిపోకపోవడంతో 1956లో మరో రెండు అంతస్తులను నిర్మించారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి పార్లమెంట్ సమావేశం ప్రస్తుతమున్న భవనంలోనే జరిగింది. భారత రాజ్యాంగాన్ని పాత పార్లమెంట్ బిల్డింగ్ లోనే ఆమోదించారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2006లో పార్లమెంట్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 2500 సంవత్సరాల నాటి భారతీయ విశిష్ట నాగరికత సంస్కృతులు ఇందులో కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న పార్లమెంటును బ్రిటిషర్లు కౌన్సిల్ హౌజ్ అని పిలిచేవారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని 60 వేల మంది కార్మికులు 20లక్షల 90వేలకు పైగా గంటలు పనిచేసి పూర్తి చేశారు. మొత్తంగా ఈ నిర్మాణానికి రెండేళ్ల 5 నెలల 18 రోజుల సమయం పట్టింది. నిర్మాణానికి తొలుత అంచనా వ్యయం 862 కోట్లుగా భావించగా.. పూర్తయ్యేసరికి 12వందల కోట్ల రూపాయలకు చేరింది.

కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి వస్తుండడంతో పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చబోమని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దానికి రిపేర్లు చేసి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తెస్తామని తెలిపింది. పాత పార్లమెంట్ భవనాన్ని దేశ పురావస్తు సంపదగా పరిరక్షిస్తామని తెలిపారు. నిజానికి కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంపై యూపీఏ 2 హయాంలో 2010లో ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో భవన నిర్మాణంపై పలు ప్రశ్నలు రేకెత్తాయి. దాంతో 2012లో అప్పటి స్పీకర్ మీరా కుమార్ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్తా రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు లాంచ్ చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరిగింది.

పాత పార్లమెంట్ ఆకారం వృత్తాకారంలో గుండ్రంగా ఉంటుంది. బిల్డింగ్ మధ్యలో వృత్తాకారంలో సెంట్రల్ ఛాంబర్ ఉంటుంది. చుట్టూ మూడు అర్ధ వృత్తాకార హాల్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ లేదా ఇప్పటి లైబ్రరీ, రెండోది స్టేట్ కౌన్సిల్ లేదా ఇప్పటి రాజ్యసభ, మూడోది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రస్తుత లోక్‌సభగా ఉన్నాయి. 1927 నుంచి 1947 వరకూ అంటే 20 ఏళ్లపాటు ఇప్పటి పార్లమెంట్ భవనానికి యజమానిగా బ్రిటీష్ ఇండియా ఉంది. 1950 నుంచి భారత ప్రభుత్వం యాజమాన్య హక్కుల్ని పొందింది. ఇప్పుడు నిర్మించిన కొత్త పార్లమెంట్ బిల్డింగ్ త్రిభుజాకారంలో ఉంది.

కొత్త పార్లమెంట్‌ భవనాన్ని అహ్మదాబాద్‌ కు చెందిన హెచ్‌సీపీ కంపెనీకి చెందిన డిజైనర్‌ బిమల్ పటేల్ డిజైన్‌ చేశారు. అహ్మదాబాద్ కు చెందిన పటేల్ సెయింట్ జేవియర్స్ స్కూల్లో చదువుకున్నారు. ఆర్కిటెక్చర్ విద్య కోసం CEPT యూనివర్శిటీ ఎంట్రన్స్ పరీక్షలో టాపర్ గా నిలిచారు. అక్కడే ఆర్కిటెక్చర్ లో డిప్లొమా చేశారు. ఆ తర్వాత పటేల్ ఆర్కిటెక్చర్, సిటీ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అలాగే బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సిటీ, రీజినల్ ప్లానింగ్‌లో PhD చేశారు. పటేల్ తండ్రి హస్ముఖ్ పటేల్ కూడా ఆర్కిటెక్చరే కావడం విశేషం. మొత్తంగా పాత కొత్త పార్లమెంట్ భవనాల్లో చాలా తేడాలు ఉన్నాయి. పాత భవనం చారిత్రక సంపద. దేశానికి సంబంధించి ఎన్నో నిర్ణయాలు జరిగిన చోటు. ఇప్పుడు కొత్త భవనం వచ్చినంత మాత్రాన దాని చారిత్రక ప్రాధాన్యానికి ఢోకా లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News