BigTV English

Dulquer Salmaan: తెలుగు నిర్మాతలతో దుల్కర్ సల్మాన్ ఫుల్ బిజీ.. లైనప్ ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Dulquer Salmaan: తెలుగు నిర్మాతలతో దుల్కర్ సల్మాన్ ఫుల్ బిజీ.. లైనప్ ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Dulquer Salmaan Lineup Telugu Movies: మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి కొడుకుగా సినిమాల్లోకి రంగ ప్రవేశం చేశాడు దుల్కర్ సల్మాన్. పలు సినిమాల చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తండ్రి మాదిరిగానే నటనలో దిట్ట. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. కథకు తగ్గ రోల్‌లో తన యాక్టింగ్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళతాడు. మలయళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ తమిళ ఇండస్ట్రీలో కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.


అంతేకాకుండా తెలుగులో కూడా తనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘సీతారామం’ సినిమాతో ఆ అభిమానుల సంఖ్య మరింత పెరిగింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ తన నటనతో కట్టిపడేశాడు. అలాగే హీరోయిన్‌గా నటించిన మృణాల్ ఠాకూర్ తన అందంతో సినిమాకు మరింత వన్నె తెచ్చింది. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ పేరు మారు మోగిపోయింది. దీంతో అతడితో సినిమాలు చేసేందుకు తెలుగు ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. ఇందులో భాగంగానే దుల్కర్ సల్మాన్ లైనప్‌లో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. అవేంటనే విషయానికొస్తే..

లక్కీ భాస్కర్:


వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలైన శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్యలు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం వంటి భాషల్లో విడుదల కానుంది.

Also Read: చివరి దశకు ‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్‌.. ఈసారి మరింత ఉత్కంఠగా..!

కాంత:

దుల్కర్ సల్మాన్ లైనప్‌లో ఉన్న మరో సినిమా ‘కాంత’. ఇటీవల తన సొంత బ్యానర్ అయిన స్పిరిట్ మీడియాతో ప్రముఖ టాలీవుడ్ హీరో కమ్ నిర్మాత రానా దగ్గుబాటి వరుసగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ‘కాంత’ సినిమాని నిర్మిస్తున్నాడు. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రానా కూడా గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వైజయంతి మూవీస్ బ్యానర్‌ & గీతా ఆర్ట్స్ బ్యానర్‌

దీంతోపాటు టాలీవుడ్ ప్రముఖ బడా నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ బ్యానర్‌ అండ్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ తెలిపారు. కాగా ఇటీవల ఆయన నిర్మించిన ‘కల్కి’ సినిమా ఎంతటి ఘన విషయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో దుల్కర్ సల్మాన్ పాత్ర చాలా అద్భుతంగా ఉంది. దీని సీక్వెల్‌లో అతడి పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే దుల్కర్ లైనప్‌లో SLV సినిమాస్ బ్యానర్‌లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇలా తెలుగు ప్రొడ్యూసర్లను లైన్‌లో పెట్టి దుల్కర్ ఫుల్ బిజీ అయిపోయాడు అనే చెప్పాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×