BigTV English

Paris 2024 Olympics Opening Ceremony: పారిస్ ఒలింపిక్స్ కి ముసుగు వీరుడొచ్చాడు

Paris 2024 Olympics Opening Ceremony: పారిస్ ఒలింపిక్స్ కి ముసుగు వీరుడొచ్చాడు

Paris 2024 Olympics Opening Ceremony Highlights: ఎన్నాళ్ల నుంచో వేచిన క్షణాలు కనులముందు ప్రత్యక్షమయ్యాయి. పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్ లోని సెన్ నదిలోని బోట్లలో వినూత్నంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అయితే ఒలింపిక్స్ లో ప్రత్యేక ఆకర్షణగా ముసుగు వీరుడు కనిపించాడు. తను ఒలింపిక్ గ్రామంలోని ఎత్తయిన బిల్డింగుల మీద నుంచి ఒక దానిపై నుంచి ఒకటి దూకుతూ ఫ్రాన్స్ చరిత్రను వివరించాడు. అందులో ఫ్రాన్స్ లో వచ్చిన ప్రజా తిరుగుబాటును వివరించాడు.


చేతిలో ఒలింపిక్ జ్యోతిలాంటి టార్చిని పట్టుకుని క్రీడా వేడుకులు, సాంస్క్రతిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాలు వీటన్నింటి మధ్య నుంచి మెరుపులా తిరుగుతూ మాయమైపోయేవాడు. ఈ ముసుగు వీరుడిని ప్రజలందరూ ఆసక్తిగా చూశారు. ఇక అన్నింటికి మించి సాహసోపేతమైన ఫీట్లు అలరించాయి. పారిస్ నగర నడిబొడ్డున చారిత్రక ప్రదేశాలను తాకుతూ వివిధ దేశాల అథ్లెట్ల పడవలు ముందుకు సాగాయి. ఈ పరేడ్ ఆరు కిలోమీటర్లు సాగింది.

ఓపెనింగ్ సెలెబ్రేషన్స్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు నుంచే పారిస్ లో వర్షం కురిసింది. మధ్యాహ్నం తుంపర్లతో ఆరంభమైన వాన.. గేమ్స్ ఆరంభం అయ్యే సమయానికి జడివానగా మారింది. భారీ వర్షంలోనే పారిస్ సీన్ నదిలో ఘనంగా క్రీడాకారుల బోట్ పెరేడ్ సాగింది.


Also Read: పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ అదుర్స్, జట్టును లీడ్ చేసిన పీవీసింధు, శరత్

అమెరికన్ పాప్ సింగర్ లేడీ గాగా, ఫ్రెంచ్-మిలానియన్ సింగర్ కమ్ సాంగ్ రైటర్ అయా నకుమురా, ఫ్రెంచ్ యాక్సెల్లె సెయింట్ సిరెల్.. తమ పెర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. యాక్సెల్లె సెయింట్ సిరెల్.. ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించారు.

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్ పతకాలను తీసుకుని రావాలని ఆకాంక్షించారు. ప్రతి క్రీడాకారుడు దేశానికి గర్వకారణం కావాలని పేర్కొన్నారు. దేశ ప్రజల్లో స్ఫూర్తినింపేలా అత్యుత్తమ విజయాలను సాధించాలని కోరారు. భారతదేశంలో కూడా ప్రపంచ స్థాయి క్రీడాకారులనున్నారనే సంగతి తెలియాలని అన్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×