BigTV English

Pakistan Troops At India Border: భారత సరిహద్దుల వద్ద మరిన్ని పాక్ బలగాలు.. ప్రధాని మోదీ ప్రసంగమే కారణమా?

Pakistan Troops At India Border: భారత సరిహద్దుల వద్ద మరిన్ని పాక్ బలగాలు.. ప్రధాని మోదీ ప్రసంగమే కారణమా?

Pakistan Troops At India Border| భారత సరిహద్దుల వద్ద పాకిస్తాన్ సైన్య బలగాల సంఖ్య రెండింతలు చేసింది. కార్గిల్ విజయ్ దివస్ సందర్బంగా శుక్రవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం చేస్తూ.. పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. ఆ వెంటనే పాకిస్తాన్ ఆర్మీ సైన్యంలోని 23వ ఇన్ ఫ్యాన్ట్రీకి చెందిన 3 పివోకె బ్రిగేడ్, 2 పివోకె బ్రిగేడ్ అనే రెండు దళాలను భారత సరిహద్దులు వద్దకు మోహరించింది.


గత నెల రోజుల్లో కాశ్మీర్ సరిహద్దుల్లోని దోడా, కఠువా ప్రాంతాల్లో ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సరిహద్దు గ్రామాల్లో దాదాపు మంది ఉగ్రవాదులు చొరబడ్డారని.. వాటి కోసం భారత సైన్యం గాలింపు చర్యలు చేపట్టిందని సమాచారం. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్.. పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులతో ఇటీవలే సమావేశమయ్యారని తెలిసింది. ఆ తరువాత సరిహద్దుల వద్ద పాక్ సైన్య బలగాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని ఇంటెలిజెన్స్ సమాచారం.

Also Read: ‘ఆ సామాజిక వర్గంపై దాడులు ఆపండి’.. పాకిస్తాన్ కు ఐరాస మానవ హక్కుల సంఘం హెచ్చరిక


ఉగ్రవాదులతో పాక్ సైనికులు
భారత్ ఇంటెలిజెన్స్ అందించిన తాజా నివేదిక ప్రకారం.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని గోయ్, థండీ కస్సీ, మథరియాని, బలావలీ ధోక్, మన్ధోల్, కోలు కీ ధేరీ, సక్రియా, కోట్లీ, మోచీ మోహ్రా, గ్రీన్ బంప్, పోలార్ వంటి ప్రాంతాలలో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ బార్డర్ యాక్షన్ టీమ్, ఉగ్రవాది మసూద్ అజ్హర్ సోదరుడితో కలిసి పనిచేస్తున్నారు.

ప్రధాని మోదీ ఏమన్నారు?
కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పించిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ.. ”ఉగ్రవాదులను పెంచి పోషించే పెత్తందారులకు ఇదే నా హెచ్చరిక. వారి క్షుద్ర పన్నాగాలు ఎప్పుడూ ఫలించవు. గతంలో పాకిస్తాన్.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా అవన్నీ విఫలమయ్యాయి. అయితా చరిత్ర నుంచి పాకిస్తాన్ పాఠాలు నేర్చుకోలేదు. ఉగ్రవాదుల సహాయంతో యుద్ధం చేస్తూనే ఉంది.” అని అన్నారు.

Also Read: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ పోటీ!

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×