BigTV English

Deepika Padukone:రియల్ గానే ‘కల్కి’ని కనబోతున్న దీపిక?

Deepika Padukone:రియల్ గానే ‘కల్కి’ని కనబోతున్న దీపిక?

Bollywood Heroine Deepika Padukone pregnant in real life
ఒక్కో సారి సినిమాలో చేసిన పాత్రలే నిజజీవితంలోనూ ఎదురవుతుంటాయి. యాథృచ్ఛికంగా జరిగినా ప్రేక్షకులు మాత్రం సినిమాలో సంఘటనే గుర్తుచేసుకుంటున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ లో దూసుకుపోతోంది.17 ఏళ్ల వయసులోనే బాలీవుడ్ లో హీరోయిన్ అవకాశాన్ని చేజిక్కించుకుంది దీపిక. ఫరాఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఓం శాంతి ఓం మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. పదేళ్లుగా దీపిక కెరీర్ అప్రతిహతంగా కొనసాగుతోంది.


పాన్ ఇండియా హీరోయిన్

పాన్ ఇండియా హీరోయిన్ గా భారీ బడ్జెట్ మూవీస్ చేస్తోంది. పఠాన్ మూవీ సక్సెస్ తో వెయ్యి కోట్ల క్లబ్ హీరోయిన్ గా చేరిపోయింది. ఇక కల్కి మూవీ సైతం వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో ఇప్పడు దీపిక పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన కల్కి మూవీలో దీపిక పాత్రే కీలకం. మొదటి భాగం అంతా ఆమె గర్భవతిగానే కనిపిస్తుంది. కల్కిని కనే కన్నతల్లిగా తన పాత్రలో జీవించింది. కల్కి విజయంలో దీపిక కూడా కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం నిజ జీవితంలోనూ దీపిక పదుకునే గర్భవతి. అయితే తల్లిగా ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న దీపిక గతంలో బేబీ బంప్స్ ఫొటోలను సైతం విడుదల చేసింది. తనకు పుట్టే బిడ్డపై అమితాసక్తి చూసిప్తోంది దీపిక. తాను సెలబ్రిటీ కాబట్టి బిడ్డను ఏ ఆయా సంరక్షణలోనో లేక బేబీ కేర్ సెంటర్ లోనూ అప్పగించనంటోంది. తానే దగ్గరుండి తన బేబీ అవసరాలను ఓ మాతృమూర్తిగా తీర్చుకుంటానని భావోద్వేగంతో ట్వీట్ చేసింది.


కల్కిని కనబోతోందంటూ కామెంట్స్

ఎక్కవ సమయం బేబీతో గడిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అందుకు తన భర్త రణవీర్ సింగ్ సహకారం కూడా అక్కర్లేదంటోంది. అయితే నెటిజెన్స్ మాత్రం దీపిక తప్పకుండా కల్కినే కంటుందని కామెంట్స్ చేస్తున్నారు. కల్కి మూవీ ఆద్యంతం దీపిక ప్రెగ్నెంట్ గానే అలరించింది. తన పాత్రకు ప్రాణం పెట్టి మరీ నటించింది. అయితే కొందరు మాత్రం దీపిక స్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామంటున్నారు. ప్రతి సెలబ్రిటీ పిల్లల విషయంలో దీపిక లాగా డెసిషన్ తీసుకోవాలని..ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు తెలియజేస్తున్నారు.

స్ఫూర్తిదాయక నిర్ణయం

సాధారణంగా సెలబ్రిటీలు తమ అందం ఎక్కడ తరిగిపోతుందో అని భయపడి పిల్లల సంరక్షణ వేరే వాళ్లకి అప్పగిస్తుంటారు. దానితో మాతృత్వం మాధుర్యం కోల్పోతున్నారు. దీపిక తీసుకున్న నిర్ణయం సమాజానికి ఓ మెసేజ్ అని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. తాను ప్రెగ్నెంట్ కారణంగా దీపిక కొన్ని కీలకమైన ప్రాజెక్టులు కూడా పక్కకు పెట్టేసింది. అందులో భాగంగానే ది వైట్ లోటస్ వెబ్ సిరీస్ మూడో సీజన్ లో నటించేందుకు ఒప్పుకోలేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×