BigTV English

Viral Video: తస్మాత్ జాగ్రత్త.. లిఫ్ట్ లో పేలిన ఛార్జింగ్ బ్యాటరీ.. చివరికి ఏం జరిగిందంటే..

Viral Video: తస్మాత్ జాగ్రత్త.. లిఫ్ట్ లో పేలిన ఛార్జింగ్ బ్యాటరీ.. చివరికి ఏం జరిగిందంటే..

నిజానికి సమ్మర్‌లో ఇలాంటి పేలుడు ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. నిజానికి ఇది పాత వీడియోనే. కానీ ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని పట్టుకుని ఓ వ్యక్తి లిఫ్ట్ ఎక్కిన క్షణాల్లోనే బ్యాటరీ పేలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి తప్పించుకునేందుకూ ఆ వ్యక్తికి అవకాశం లేకుండా పోయింది. లిఫ్ట్‌ డోర్ అప్పటికే క్లోజ్ అవ్వడంతో ఆ మంటలకు ఆహుతయ్యాడు.

భారీగా శబ్దం రావడంతో బయట ఉన్నవారికి ఈ విషయం తెలిసింది. వెంటనే సెక్యూరిటీ ఇన్ఫామ్‌ చేశారు. సెక్యూరిటీ వచ్చి లిఫ్ట్‌ డోర్స్‌ ఓపెన్ చేసి అతడిని బయటికి తీసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటలను ఆర్పి అతడిని బయటికి తీసుకొచ్చేసరికి అతడి ప్రాణాలు పోయాయి. అతని శరీరం పూర్తిగా కాలిపోయింది.


Also Read: కూతురిని ఎదురుగా పెట్టుకుని ప్రమాదకరమైన విన్యాసాలు..

అసలు ఈఘటన 2021లో జరిగింది. కానీ ఈ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అయితే ఎలక్ట్రిక్ బ్యాటరీలను లిఫ్ట్‌లో తీసుకెళ్తే పేలిపోతాయా? అనే ప్రశ్న ఇప్పుడు ఈ వీడియో చూసిన వారికి వస్తుంది. కానీ అది నిజం కాదు. బ్యాటరీలను లిఫ్ట్‌లో తీసుకెళ్తే ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ ఆ బ్యాటరీ పార్ట్స్‌ అప్పటికే దెబ్బతిని ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరి కరెక్ట్‌గా ఈ ప్రమాదం జరగడానికి కారణమేంటి? దీనికి కొన్ని కారణాలు అయ్యి ఉండవచ్చని చెబుతున్నారు. బ్యాటరీ ఎలక్ట్రానిక్స్‌లో ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉండాలి. లేదా లిఫ్ట్‌లో ఏదైనా సాంకేతిక లోపంతో మంటలు చెలరేగి ఉండవచ్చని చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ-బైక్ బ్యాటరీలను క్యారీ చేసేప్పుడు మ్యాన్‌ఫ్యాక్చర్ గైడ్‌లైన్స్‌ను తప్పకుండా పాటించాలి. బ్యాటరీలో ఏదైనా లోపం ఉందనిపించినప్పుడు వెంటనే టెక్నిషియన్‌కు చూపించాలి.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×