Big Stories

Ayurvedic Remedies for Cold : జలుబును తగ్గించే ఆయుర్వేద చిట్కాలు

Ayurvedic Remedies to control Cold : మార్చి ఇంకా మొదలే కాలేదు.. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు జలుబు ఎందుకొస్తుందనుకుంటున్నారా ? వాతావరణం చల్లగా ఉంటేనే కాదు.. చల్లటినీరు తాగినా, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటివి ఎక్కువగా తీసుకున్నా జలుబు చేసే అవకాశాలు ఎక్కువ. జలుబు అనేది సీజనల్ వ్యాధి కాదు. కాబట్టి ఏ కాలంలోనైనా, ఎప్పుడైనా రావొచ్చు.

- Advertisement -

ప్రతిదానికి మందులు వాడటం కూడా అంతమంచిది కాదు. అందుకే ఇంట్లోనే.. నేచురల్ రెమడీస్ తో జలుబును తగ్గించుకునే 10 చిట్కాలు మీకోసం. అవేంటో చూద్దాం.

- Advertisement -

Read More : మానసిక ఒత్తిడితో ఇబ్బందా ? ఈ వాసనలు పీలిస్తే పోతుందట

  1. జలుబుకు బెల్లం మంచి ఔషధం. చిన్న బెల్లం ముక్కను పొడి చేసి.. అందులో కొద్దిగా మిరియాలపొడి కలిపి.. దానిని చిన్న ఉండల్లా చేసుకుని పెట్టుకోవాలి. పూటకు ఒకటి చొప్పున గోరువెచ్చని నీటితో తీసుకుంటూ ఉంటే.. ఉపశమనం లభిస్తుంది.
  2. జీలకర్రను వేయించి.. దానిని పొడిచేసుకోవాలి. ఒక టీ స్పూన్ జీరా పొడిని అంతే మోతాదులో చక్కెర తీసుకుని.. రెండింటినీ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో లేదా పాలలో కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే.. జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
  3. లవంగాలు లేదా మిరియాలతోనూ జలుబును తగ్గించుకోవచ్చు. వాటిని నీటిలో వేసి అందులో కొద్దిగా బెల్లం కలుపుకోవాలి. కషాయంలా కాచుకుని రోజుకు రెండుసార్లు 60 ఎంఎల్ చొప్పున తీసుకోవాలి. జలుబుతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలూ తగ్గుతాయి.
  4. అర టీ స్పూన్ వాము, టీ స్పూన్ పటికబెల్లం తీసుకుని చూర్ణంగా చేసి తిన్నాక.. గోరువెచ్చని నీటిని తాగాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  5. పసుపు యాంటీ బయాటిక్. పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.
  6. కొద్దిగా వామును వేడి చేసి.. పలుచటి క్లాత్ లో వెతి ముఖంపై కాపడం పెట్టుకుంటే శ్లేష్మం కరిగి.. జలుబు తగ్గుతుంది.
  7. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో మిరియాలపొడి, బెల్లం కలిపి తాగితే జలుబు తగ్గుతుంది.
  8. పావు టీ స్పూన్ మోతాదులో పసుపు తీసుకుని.. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే రొంప సమస్య తగ్గుతుంది.
  9. అర టీ స్పూన్ మిరియాల పొడి, టీ స్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
  10. గులాబీ పువ్వు రేకులను తీసుకుని.. నువ్వుల నూనెలో వేసి.. అరగంటపాటు ఉంచాలి. ఆ తర్వాత 5 నిమిషాలు వేడి చేయాలి. ఆపై వడకట్టి ముక్కు రంధ్రాల్లో రెండేసి చుక్కల చొప్పున వేయాలి. ఇలా చేస్తే తుమ్ములు తగ్గుతాయి.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News