BigTV English

Money Refund on OnePlus 12R: ఈ ఫోన్ కొన్నవారికి మనీ వాపస్.. కారణం ఇదే..?

Money Refund on OnePlus 12R: ఈ ఫోన్ కొన్నవారికి మనీ వాపస్.. కారణం ఇదే..?
OnePlus 12R

OnePlus 12R Refund: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ ఇటీవల వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్ అనే రెండు ఫోన్లను లాంచ్ చేసింది. అంతేకాకుండా ఈ రెండు ఫోన్‌ల అమ్మకాలను కూడా స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ రెండు ఫోన్లలో వన్‌ప్లస్ 12ఆర్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు కంపెనీ ఓ ఆఫర్ అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


వన్‌ప్లస్ 12ఆర్‌ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ని ఎవరైతే కొనుగోలు చేశారో.. కంపెనీ ఆ కస్టమర్లకు డబ్బును పూర్తి రీఫండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మరి కంపెనీ ఎందుకు రీఫండ్ చేస్తుందో.. కారణం ఏంటో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వన్‌ప్లస్ ఈ 12ఆర్‌ ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకువచ్చింది.

మొదటి వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌.. అలాగే రెండో వేరియంట్ 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ని కలిగి ఉంది. అయితే ఈ సిరీస్‌ను లాంచ్ చేసే సమయంలో వన్‌ప్లస్ కంపెనీ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై ఓ ప్రకటన చేసింది. 256 జీబీలో యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఫీచర్ ఉందని పేర్కొంది.


Read More: వన్‌ప్లస్ 12R విక్రయాలు షురూ..

అలాగే 128 జీబీ వేరియంట్‌లో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఫీచర్ ఉందని తెలిపింది. అయితే వన్‌ప్లస్ 12ఆర్ వేరియంట్ కోసం కంపెనీ చేసిన ప్రకటన తప్పు అని రుజువైంది. ఈ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఫీచర్‌తో అందుబాటులో ఉంది.

దీంతో కంపెనీ చేసిన తప్పుడు ప్రచారం కారణంగా ఇప్పుడు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు పూర్తి డబ్బును తిరిగి రీఫండ్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఈ విషయంపై వన్‌ప్లస్ ప్రెసిడెంట్, సీవోవో కిండర్ లియు స్పందించారు. ఈ మేరకు ఈ సమస్యపై చర్య తీసుకుంటున్నామని అన్నారు.

అందువల్ల ఎవరైనా వన్‌ప్లస్ 12ఆర్ 256 జీబీ వేరియంట్‌ని కొనుగోలు చేసి ఉంటే.. ఫోన్ ఫైల్ సిస్టమ్ టైప్ స్టేటస్ గురించి కస్టమర్ కేర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఇక ఈ రీఫండ్ వచ్చేనెల మార్చి 16వ తేదీ వరకు వస్తుందని సమాచారం.

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×