Big Stories

Health Benefits of Pickles: పచ్చళ్లతో ఆరోగ్యానికి అదిరిపోయే ప్రయోజనాలు.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా!

Health Benefits of Pickles: భారతదేశంలో పచ్చళ్లు అంటే తెలియని వారెవరు ఉండరు. పికిల్స్ అంటే అంత ఫేమస్ మరి. ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా కూడా పచ్చళ్లుకు ఉండే టేస్ట్ వేరు. ముఖ్యంగా వేసవికాలం వచ్చిందంటే చాలు పచ్చళ్లు లేకుండా ఆ వేసవి పూర్తే కాదు. అవి కూరలు లేకున్నా కూడా అందుబాటులో ఉండేలా ఉంటాయి. ఒక్కసారి పచ్చడి తయారు చేసి పెడితే ఏకంగా నెలల తరబడి తినేయోచ్చు. కేవలం ఆకలిని తీర్చడానికే కాదు. రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇలా తినే పచ్చళ్లను కేవలం రుచికి మాత్రమే అనుకుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

- Advertisement -

యాంటీ బయోటిక్స్, ప్రోబయోటిక్స్..

- Advertisement -

పచ్చళ్లతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. నిల్వ పచ్చళ్ల వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే ప్రోబయోటిక్లు కూడా మేలు చేస్తాయి. ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి బ్యాక్టీరియా పెరుగుదల ప్రోత్సహిస్తాయి. పచ్చళ్లలో వేసే మసాలాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయట. నిల్వ పచ్చళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను కాపాడి అవసరమైన సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. అంతేకాదు వృద్ధాప్య ఛాయను కూడా తొలగించేందుకు తోడ్పడతాయి. ఊరగాయ, టమాట వంటి నిల్వ పచ్చళ్లలో సెల్యులార్ మెటబాలిజం ప్రభావాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

విటమిన్లు..

నిల్వ పచ్చళ్లో కూడా కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, మెంతులు వంటి వాటితో చేసే పచ్చళ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, కే, ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు శరీరానికి లాభాలు ఇస్తాయి.

Also Read: Health Benefits Of Baby Soaps: చిన్న పిల్లలకు పెద్దలు వాడే సబ్బులు వాడొచ్చా..?

రోగనిరోధక శక్తి..

పచ్చళ్ల కోసం తయారు చేసే మసాలాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పచ్చళ్లలోని బ్యాక్టీరియాల కారణంగా వైరస్‌ల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. మెదడులో న్యూరోట్రోఫిక్ ఫాక్టర్ వంటి గ్రోత్ హార్మోన్ స్థాయిలను కూడా పెంచేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు డిప్రేషన్, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధింత వ్యాధులతో బాధపడే వారికి ఇవి సహాయపడతాయి.

గర్భిణీలు..

గర్భిణీలు పచ్చళ్లు తినడం వల్ల మొదటి మూడు నెలలు వికారం, వాంతులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. పుల్లగా, ఒగరుగా, కారంగా ఉంటాయి పచ్చళ్లు. అందువల్ల ఇవి ఆకలిని పెంచేందుకు తోడ్పడుతాయి. గర్భాధారణ టైంలో మార్నింగ్ సిక్ నెస్ ను కూడా తగ్గిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News