Big Stories

KTR Meeting on MLC Elections: బీఆర్ఎస్‌.. కథ అడ్డం తిరుగుతోందా..? 130 మందిని రమ్మంటే.. 30 మందే, ఎందుకిలా..?

KTR Review Meeting on MLC Elections 2024: బీఆర్ఎస్ పార్టీలో మరో చిచ్చు మొదలైందా..? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో ఆ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ చేసింది. ఎలాగైనా ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవాలని ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలను సిద్ధం చేసింది కారు పార్టీ.

- Advertisement -

బుధవారం హైదరాబాద్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రివ్యూ సమావేశానికి రావాలని ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలు, నియోజకవర్గాల ముఖ్యనేతలకు పిలుపు ఇచ్చారు కేటీఆర్. విచిత్రం ఏంటంటే 130 మందిని రమ్మంటే.. కేవలం 30 మంది రావడంతో కాసింత అసహనం వ్యక్తం చేశారట ఆ పార్టీ ఉపాధ్యక్షుడు. ఎందుకిలా జరిగిందని కీలక నేతలతో అన్నట్లు సమాచారం.

- Advertisement -

ఇందుకు కారణాలు లేకపోలేదు. సమావేశానికి రాని వారిలో వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి నేతలు ఉన్నారు. ఉపఎన్నిక అభ్యర్ధి రాకేష్‌రెడ్డిని ఆయా నేతలు గట్టిగా వ్యతిరేకించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో డుమ్మా కొట్టారన్నది బలంగా వినిపిస్తున్నమాట. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న రాకేష్‌రెడ్డి ఏకపక్షంగా ఎంపిక చేయడమే మాజీల అసంతృప్తికి కారణమని తెలుస్తోంది.

Also Read: సంజయ్ కామెంట్స్, ఫలితాల తర్వాత కేసీఆర్…

బీఆర్ఎస్ భవన్‌లో ఎప్పుడు మీటింగ్ పెట్టినా భారీగా నేతలు వచ్చేశారు. ఇప్పుడు నేతల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోందని అంటున్నారు. అన్నట్టు ఆ మధ్య బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని ఓపెన్‌గా చెప్పేశారు. ఈ లెక్కన ఆ పార్టీలో ఉన్న నేతలు ముందుగా వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారా అన్న అనుమానాలు లేకపోలేదు. కొద్దిరోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రానున్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంకెంతమంది కారు దిగుతారో అన్న చర్చ అప్పుడే బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది. రానున్న రోజుల్లో ఆ పార్టీలో ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News